అప్పుడు బ్రాత్‌వైట్.. ఇప్పుడు స్టోక్స్! వరుస 4 సిక్సర్లకి బదులు తీర్చుకున్నఇంగ్లీష్ ఆల్‌రౌండర్! (వీడియో )

హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2016 ప్రపంచకప్‌లో తనకు ఎదురైన ఘోర పరాభవానికి.. ఐదు సంవత్సరాల తరువాత బదులు తీర్చుకున్నాడు. టీ20 బ్లాస్ట్‌లో ప్రస్తుతం ఆడుతున్న బెన్ స్టోక్స్.. విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 6,4,0,6 బాదేశాడు. టీ20 బ్లాస్ట్‌లో డర్హామ్ టీమ్‌కి స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. బ్రాత్‌వైట్ వార్‌విక్‌షైర్‌కి ఆడుతున్నాడు.
6,6,6,6
భారత్‌లో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీ తుది పోరులో ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్ (54), జొస్ బట్లర్ (36), డేవిడ్ విల్లీ (21) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు తీశారు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది. 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్‌లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ వేసిన చివరో ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచిన బ్రాత్‌వైట్ విండీస్‌కు విజయాన్ని అందించాడు.

6,4,0,6
2016 టీ20 ప్రపంచకప్ అనంతరం బెన్ స్టోక్స్, కార్లోస్ బ్రాత్‌వైట్ ప్రత్యర్థులుగా ఎక్కువగా ఎదురుపడలేదు. టీ20 బ్లాస్ట్‌లో డర్హామ్ టీమ్‌కి స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. బ్రాత్‌వైట్ వార్‌విక్‌షైర్‌కి ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన బ్రాత్‌వైట్‌కి స్టోక్స్ భారీ షాట్లు ఆడుతూ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో 6,4,0,6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. 20 బంతుల్లో స్టోక్స్ 35 పరుగులు చేయగా.. డర్హామ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం వార్‌విక్‌షైర్ 18.3 ఓవర్లలోనే ఆలౌట్ అయి పరాజయం పాలైంది.
Rajiv Gandhi Khel Ratna పురస్కారం కోసం మిథాలీ, అశ్విన్.. అర్జున కోసం ముగ్గురు!!

ఫామ్ అందుకునే పనిలో స్టోక్స్
ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్‌లు ఆడిన బెన్ స్టోక్స్.. ఆరంభంలోనే చేతి వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ మే 4న టోర్నీ నిరవధికంగా వాయిదా పడగా.. సెప్టెంబరు 19 నుంచి సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించబోతోంది. దాంతో ఫామ్ అందుకునే పనిలో స్టోక్స్ బిజీగా ఉన్నాడు. మరోవైపు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్రస్తుతం ఐపీఎల్ లేదు. గత వేలంలో అతడిని ఏ ప్రాంచైజీ కొనుగోలుచేయలేదు. ఇక టీ20 బ్లాస్ట్ ఫైనల్ సెప్టెంబర్ 18న జరగనుంది. అదే సమయంలో ఐపీఎల్ 14 ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications