For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్జరీ పూర్తయింది.. అతి త్వరలో మీ ముందుకు వస్తా: టీ నటరాజన్

T Natarajan Undergoes Knee Surgery, SRH Bowler Says Looking Forward To Come Back Stronger And Fitter

చెన్నై: టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్‌కు మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని ఈ తమిళనాడు క్రికెటరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అతి త్వరలో మైదానంలోకి అడుగుపెడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఈరోజు(ఏప్రిల్‌ 27వ తేదీ) నా మోకాలికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నా సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్‌ టీమ్‌, సర్జన్స్‌, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కుకు కృజజ్ఞతలు. ఇక నా సర్జరీ విజయవంతం కావాలని విష్‌ చేసిన బీసీసీఐకి, అభిమానులు, నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. వీలైనం త్వరగా ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి దిగుతా. మీ మద్దతు, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని'అని నట్టూ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన నట్టూ.. తొలుత బెంచ్‌కు పరిమితమయ్యాడు. కానీ సర్జరీ చేయాల్సిందేనని నిపుణులు తేల్చడంతో అతను అర్థాంతరంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సర్జరీ చేసుకున్న నట్టూకు తగిన విశ్రాంతి అవసరం. ఈ లెక్కన అతను ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఆడటం కష్టమే.

ఇక నట్టూ గైర్హాజరీలో హైదరాబాద్ పూర్తిగా తడబడుతుంది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ ఆరంభంలో రాణిస్తున్నా.. డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు. ఇక టీమ్ మిడిలార్డర్ బలహీనతతో గెలిచే మ్యాచ్‌ల్లో కూడా ఓటమి పాలవుతుంది. భారమంతా డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్‌పైనే పడుతుంది. వార్నర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోవడంతో హైదరాబాద్‌కు పరాజయాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.

Story first published: Tuesday, April 27, 2021, 17:22 [IST]
Other articles published on Apr 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+