మహింద్రా థార్‌ను నడిపిన నటరాజన్... ఆనంద్ మహింద్రాకు రిటర్న్ గిఫ్ట్!

చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ ఆటగాళ్లకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా తమ సంస్థకు చెందిన ఎస్‌యూవీ మహింద్రా థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషన్, తమిళనాడు క్రికెటర్ టీ నటరాజన్.. ఆనంద్ మహింద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేగాకుండా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజనే గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు అందిన ఎస్‌యూవీ మహింద్రా థార్ వాహనానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నాడు.
మీ ప్రేమకు కృతజ్ఞతలు సార్..
'భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నా జీవితంలోనే నాకు దక్కిన గొప్ప వరం. నాకు దక్కుతున్న ఈ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు నన్ను కట్టిపడేస్తున్నాయి. అద్భుతమైన వ్యక్తుల నుంచి మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆనంద్ మహింద్రా గారు నాకు బహుమతిగా ఇచ్చిన మహింద్రా థార్ వాహనాన్ని ఈ రోజే నడిపాను.
నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన శ్రీ ఆనంద్ మహింద్రా గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రికెట్‌పై మీకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది సార్. మీ కోసం నా అరంగేట్ర టెస్ట్ అయిన గబ్బా మ్యాచ్‌లోని జెర్సీని నా సంతకంతో పంపిస్తున్నాను. 'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
నటరాజన్‌తో పాటు..
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా 'థార్ ఎస్‌యూవీ' కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, టీ నటరాజన్‌లకు మహీంద్రా కార్లను ఇచ్చారు. సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు. సుందర్ (62), శార్దూల్ (66) నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలతో రాణించారు. శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రాణించాడు. సైనీ తనవంతు పాత్ర పోషించాడు.

సన్‌రైజర్స్‌తో నట్టూ..
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ అనంతరం నేరుగా జట్లతో కలిసేవారికి క్వారంటైన్ మినహాయించిన నట్టూ.. బబుల్ ధాటి ఇంటికి వెళ్లొచ్చాడు. దాంతో అతను మరొకసారి క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. గత సీజన్‌లో తనదైన యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications