For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T Natarajan టెస్టు జెర్సీ ధరించనుండటం ఎంతో గర్వకారణం.. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నా!

T Natarajan said A proud moment to wear the white jersey

హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో తంగరసు నటరాజన్ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ఆకట్టుకున్నాడు. దీంతో సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వరుణ్ చక్రవర్తి గాయంతో నటరాజన్‌కు టీ20ల్లో ఆడే అవకాశం దక్కింది. ఆ తర్వాత నవదీప్ సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది. ఇప్పుడు ఉమేష్ గాయంతో టెస్టుల్లో కూడా చోటు దక్కింది. ఆసీస్ గడ్డపైనే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఆరంగేట్రం చేసిన నట్టూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఆడడానికి సిద్దమయిపోయాడు.

సవాళ్లకు సిద్ధంగా ఉన్నా:

సవాళ్లకు సిద్ధంగా ఉన్నా:

రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ గాయంతో సుదీర్ఘ ఫార్మాట్‌ జట్టులో ఎంపికైన టీ నటరాజన్ .. టీమిండియా టెస్టు జెర్సీ ధరించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 'భారత టెస్టు జెర్సీ ధరించనుండటం ఎంతో గర్వకారణం. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నా' అని ఆ ఫోటోకి వ్యాఖ్య జత చేశాడు. అయితే ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టులో నటరాజన్‌కు చోటు దక్కదని సమాచారం. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని నట్టూ టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం కోసం మరికొన్ని రోజులు ఎదురూచూడాలి.

యాజమాన్యం అలా ఆలోచిస్తే:

ఇప్పటికే గాయాలతో సీనియర్ పేసర్లు మొహ్మద్, ఉమేశ్‌ యాదవ్‌ జట్టుకు దూరమవ్వడంతో యువపేసర్లకు జస్ప్రీత్ బుమ్రా మార్గనిర్దేశం చేస్తూ పేస్‌ బాధ్యతల్ని మోస్తున్నాడు. వైవిధ్యంతో బౌలింగ్ చేయగలిగే టీ నటరాజన్‌కు అవకాశం ఇస్తే కచ్చితంగా బుమ్రాపై ఒత్తిడి తగ్గనుంది. ఈ విషయాన్ని టీమిండియా యాజమాన్యం ఆలోచిస్తే.. కంగారూల గడ్డపైనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నటరాజన్‌ నిలుస్తాడు. మరి నట్టూ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడో లేదో రేపు తేలనుంది.

శార్దుల్‌ను నుంచి గట్టిపోటీ:

శార్దుల్‌ను నుంచి గట్టిపోటీ:

మ‌హ్మ‌ద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కూడా టెస్ట్ సిరీస్‌కు ఎంపికవ్వడంతో.. ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే నటరాజన్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో.. మూడో టెస్ట్ కోసం శార్దుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నటరాజన్‌ తమిళనాడు తరఫున ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడగా, శార్దుల్‌ ముంబై తరఫున 62 మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు తీశాడు. ఇంతకుముందే శార్దుల్‌ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా.. గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయిన సంగతి తెలిసిందే. శార్దుల్‌ భారత జట్టు తరఫున ఇదివరకే బ్యాటింగ్‌లోనూ సత్తాచాటడం, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 6 అర్ధ శతకాలు ఉండడం సానుకూలాంశం.

అరంగేట్రంలోనే అదుర్స్:

అరంగేట్రంలోనే అదుర్స్:

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నటరాజన్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్‌ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు. తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. మూడో టీ20లో నాలుగు ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి ఒక విక్కెట్ తీశాడు.

చిన్న వయసులోనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా జీవా.. ఒకే ఇంట్లో ఇద్దరు!!

Story first published: Tuesday, January 5, 2021, 14:36 [IST]
Other articles published on Jan 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+