For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్న వయసులోనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా జీవా.. ఒకే ఇంట్లో ఇద్దరు!!

Ziva Dhoni gets first brand endorsement at age of 5

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా, విన్నా మహీ అభిమానులే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తరువాత కూడా ధోనీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇక బ్రాండ్‌ అంబాసిడర్‌గా పలు సంస్థలతో కొత్తగా ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నాడు. కెరీర్ తొలినాళ్లలో సోలోగా, ఆ తర్వాత భార్య సాక్షి ధోనీతో కలిసి ప్రకటనలు చేసిన మహీ.. ఇప్పుడు తన ముద్దుల కుమార్తె జీవా ధోనీతో కలిసి రంగంలోకి దిగాడు.

ఎంఎస్ ధోనీ కుమార్తె జీవా నాలుగేళ్ల వయసులో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. తండ్రితో కలిసి ఓరియో బిస్కెట్లను ప్రచారం చేసింది. సదరు ప్రకటనను ఓరియో సంస్థ విడుదల చేసిన తర్వాత తండ్రీకుమార్తెలు మరింత సంచలనంగా మారారు. ఇప్పటికే మహీ అతిపెద్ద బ్రాడ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహీ బాటలో ఆయన కుమార్తె జీవా కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. క్యాడ్బరీ ఓరియో బిస్కెట్స్ ప్రకటన ద్వారా జీవా మొదటిసారి ప్రొఫెషనల్ వీడియోలో కనిపించింది. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరు అంబాసిడర్లు తయారై కొత్త రికార్డును నెలకొల్పారు. ఇన్నాళ్లూ సామాజిక మాధ్యమాలకే పరిమితమైన తండ్రీకూతుళ్లను బుల్లితెరపై చూసి ఆనందంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తరువాత కూడా ఎంఎస్‌ ధోనీకి ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్‌గా మహీ మొదటి నుంచి ముందు వరుసలోనే నిలిచాడు. ఇప్పుడు జీవా కూడా ప్రకటనల్లో నటించడం ప్రారంభించింది. మరింత క్రేజ్ రానుంది. కేవలం నాలుగేళ్ల వయసులో జీవా అభిమానుల సంఖ్య కోట్లలో ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో జీవాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫొటోలు, వీడియోలతో పాటు ధోనీ, సాక్షితో ఉన్నవి కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. వారి కలిసి ఉన్న ఫొటోలకైతే లైకులే లైకులు.

సెలెబ్రిటీవర్త్ ప్రకారం ఎంఎస్ ధోనీ ప్రస్తుతం 170 మిలియన్ల డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు. మహీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)లో లేనప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతూ ప్రతి సంవత్సరం సుమారు రూ.15 కోట్లు సంపాదిస్తున్నాడు. తాజాగా అతను సేంద్రియ వ్యవసాయం కూడా ప్రారంభించాడు. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను దుబాయ్‌లో విక్రయించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. ఇక కోళ్ల ఫామ్ కూడా మొదలెట్టనున్నాడు. మొత్తానికి మహీ క్రికెట్ ఆడకున్నా.. బిజీబిజీగా గడుపుతున్నాడు.

Story first published: Tuesday, January 5, 2021, 12:59 [IST]
Other articles published on Jan 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+