Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమేశ్‌ స్థానంలో న‌ట‌రాజ‌న్..టెస్ట్ ఆరంగేట్రం లాంఛనమేనా? శార్దుల్‌ను నుంచి గట్టిపోటీ! టెస్ట్ జట్టు ఇదే!

T Natarajan replaces Umesh Yadav in India test squad

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పిక్క కండరం పట్టేయడంతో ఇంటిదారి ప‌ట్టిన టీమిండియా సీనియర్ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ స్థానంలో లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ టీ న‌ట‌రాజ‌న్‌కు చోటు ద‌క్కింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ శుక్ర‌వారం ట్విట‌ర్ వేదికగా వెల్ల‌డించింది. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలోనే వన్డే, టీ20ల్లో ఆరంగేట్రం చేసిన న‌ట‌రాజ‌న్.. టెస్టుల్లో కూడా తొలిసారి ఆడడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తొలి టెస్ట్‌లో గాయ‌ప‌డిన స్టార్ పేసర్ మ‌హ్మ‌ద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్న విష‌యం తెలిసిందే.

ఉమేశ్‌ స్థానంలో న‌ట‌రాజ‌న్:

రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తుండగా.. పిక్క కండరం పట్టేయడంతో ఉమేశ్‌ యాదవ్ మైదానాన్ని వీడాడు. అడిలైడ్ టెస్ట్‌లో మొహ్మద్ షమీకి మ‌ణిక‌ట్టు గాయ‌మైంది. ఇప్పుడీ ఇద్దరు బౌల‌ర్లు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీకి రీహాబిలిటేష‌న్ కోసం వెళ్ల‌నున్నారు. షమీ చేతి ఎముక విరిగిన‌ట్లు బీసీసీఐ తొలిసారి అధికారికంగా వెల్ల‌డించింది. అయితే అత‌డు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడా లేక ఇండియాకు తిరిగి వ‌చ్చేశాడా అన్న‌దానిపై బీసీసీఐ స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. గాయపడిన ఇద్దరి స్థానాల్లో న‌ట‌రాజ‌న్, శార్దూల్ జట్టులోకి వచ్చారు.

ముంబై తరఫున 62 మ్యాచ్‌లు:

ముంబై తరఫున 62 మ్యాచ్‌లు:

ఆస్ట్రేలియాతో వ‌న్డే, టీ20ల్లో ఆడిన టీ న‌ట‌రాజ‌న్‌.. ప్రస్తుతం ఆసీస్ గడ్డపైనే ఉన్నాడు. ఇండియ‌న్ టీమ్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మ‌హ్మ‌ద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కూడా ఎంపికవ్వడంతో.. ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే నటరాజన్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో.. మూడో టెస్ట్ కోసం శార్దుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నటరాజన్‌ తమిళనాడు తరఫున ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడగా, శార్దుల్‌ ముంబై తరఫున 62 మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు తీశాడు.

శార్దుల్‌ను నుంచి గట్టిపోటీ:

శార్దుల్‌ను నుంచి గట్టిపోటీ:

ఇంతకుముందే శార్దుల్‌ ఠాకూర్‌ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా.. గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయిన సంగతి తెలిసిందే. శార్దుల్‌ భారత జట్టు తరఫున ఇదివరకే బ్యాటింగ్‌లోనూ సత్తాచాటడం, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 6 అర్ధ శతకాలు ఉండడం సానుకూలాంశం. దీంతో నటరాజన్‌ను కాకుండా అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆసీస్ గడ్డపై ఇప్పటికే సత్తాచాటిన నట్టూను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్ సత్తాచాటడం మనోడికి కలిసిరానుంది. మరి కెప్టెన్ ఎవరికీ ఓటేస్తాడో చూడాలి.

భారత్ టెస్ట్ జట్టు:

భారత్ టెస్ట్ జట్టు:

అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, హనుమా విహారి, శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్) జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, టీ నటరాజన్.

క్యారీ 'కమాల్' క్యాచ్‌.. పక్కకు దూకుతూ ఒంటి చేత్తో పట్టాడుగా (వీడియో)

Story first published: Friday, January 1, 2021, 16:09 [IST]
Other articles published on Jan 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+