Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యారీ 'కమాల్' క్యాచ్‌.. పక్కకు దూకుతూ ఒంటి చేత్తో పట్టాడుగా (వీడియో)

Adelaide Strikers captain Alex Carey takes stunning catch in BBL 10

హైదరాబాద్: క్రికెట్ ఆట‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020లో ఇలాంటివి చాలానే చూశాం. ఐపీఎల్ త‌ర‌హాలోనే సాగిన వుమెన్స్ బిగ్‌బాష్‌ (బీబీఎల్) లీగ్‌లో ఓ అద్భుత‌మైన ఫీల్డింగ్ ఫీట్ చోటుచేసుకున్న‌ది. ఇద్దరు మహిళలు కలిసి ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టారు. తాజాగా బిగ్‌బాష్‌10 లీగ్‌లో మరో అద్భుత ఫీల్డింగ్ విన్యాసం చోటుచేసుకుంది.

బిగ్‌బాష్‌10 లీగ్‌లో గురువారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినా.. అడిలైడ్‌ కెప్టెన్‌ అలెక్స్‌ క్యారీ హీరోగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌లో మెరిసిన కేరీ.. ఆ తర్వాత కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. పెర్త్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 8వ ఓవర్‌ వెస్‌ అగర్‌ వేశాడు. అగర్‌ వేసిన బంతి బౌన్స్‌ అయి లియామ్‌ లివింగ్‌స్టోన్‌ బ్యాట్‌ను తాకుతూ క్యారీకి దూరంగా వెళ్లింది. ఆ క్యాచ్‌ అందుకోవడం కష్టమే. కానీ క్యారీ మాత్రం ఒకవైపుకు దూకుతూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో లివింగ్‌స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

అలెక్స్‌ క్యారీ పట్టిన క్యాచుకు సంబందించిన వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తన ట్విటర్‌లో షేర్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ 'స్టన్నింగ్‌ డైవ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్' అంటూ వీడియోకు కామెంట్లు వస్తున్నాయి. 'సమ్మర్‌లో అద్భుత క్యాచ్ ఇదే' అంటూ మరికొందరు పోస్టులు చేశారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూడండి.

అంతకముందు అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో అలెక్స్‌ క్యారీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. కేరీ ఇన్నింగ్స్‌తో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్‌ స్కార్చర్స్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పెర్త్‌ ఇన్నింగ్స్‌లో జాసన్‌ రాయ్‌ (49), జోష్‌ ఇన్‌గ్లిస్‌ (44) రాణించగా.. చివర్లో మిచెల్‌ మార్ష్‌ 38 పరుగులు చేసి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. క్యారీ అద్భుతాలు చేసినా మ్యాచ్ మాత్రం గెలవలేదు.

Story first published: Friday, January 1, 2021, 15:29 [IST]
Other articles published on Jan 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+