Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మన నట్టూకు స్వాగతం అదిరిపోయిందిగా.. రథంపై ఊరేగిస్తూ సంబరాలు!! (వీడియో)

T Natarajan receives a warm welcome at his native village Salem

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై చారిత్రక విజయంతో స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులకు అభిమానులు ఎర్రరంగు తివాచీతో గొప్ప స్వాగతాన్ని పలికారు. గురువారం తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానేతో పాటు రోహిత్‌ శర్మ, పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఓపెనర్ పృథ్వీ షా, కోచ్‌ రవిశాస్త్రి ముంబైకు చేరుకోగా.. బ్రిస్బేన్‌ హీరో రిషభ్‌ పంత్‌ ఢిల్లీలో దిగాడు. ఎయిర్‌పోర్టులో రహానే అండ్‌ కోను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. టీమ్‌ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని జింక్స్.. కేక్‌ కట్‌ చేశాడు.

ఆలారే ఆల.. అజింక్యా ఆలా:

అజింక్య రహానేకు అతడు నివసించే కాలనీ వాసులు ఊహించని రీతిలో రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌ పలికారు. ముంబై సబర్బన్‌లో అతడు ఉండే సొసైటీకి చేరుకోగానే.. 'ఆలారే ఆల.. అజింక్యా ఆలా' అంటూ ఆ ప్రాంతం అంతా మార్మోగింది. కుమార్తె ఆర్య, భార్య రాధికతో కలసి అతడు నడిచి వస్తుంటే.. పూలు చల్లుతూ, డప్పులు వాయిస్తూ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. తన కుమారుడికి లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి జింక్స్ తండ్రి మధుకర్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును గొప్పగా నడిపించిన రహానేను చూసి గర్వంగా ఉందన్నారు.

రథంపై ఊరేగిస్తూ:

రథంపై ఊరేగిస్తూ:

ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాకుండా అంచనాలను మించి రాణించిన తమిళనాడు పేసర్‌ తంగరసు నటరాజన్‌కు అతని స్వస్థలం చిన్నప్పంపట్టిలో అభిమానులు నీరాజనాలు పలికారు. నటరాజన్‌ బెంగళూరులో దిగి.. నేరుగా చిన్నప్పంపట్టి చేరుకోగానే డోలు, మేళాలు వాయిస్తూ.. గులాబి రేకులు చల్లుతూ మన నట్టూ వచ్చాడంటూ అభిమానులు సందడి చేశారు. గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన అభిమానులు.. నట్టూను పూలమాలలతో సత్కరించి పల్లకీలా తయారు చేయించిన గుర్రపు బగ్గీలో ఊరేగించి విజయయాత్ర చేశారు. ఆ సమయంలో నట్టూ జాతీయ జెండాను పట్టుకుని మురిసిపోయాడు. దీనికి సంబందించిన వీడియోను మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

సందడి వాతావరణం:

సందడి వాతావరణం:

ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన హైదరాబాదీ పేస్ బౌలర్‌ మొహ్మద్ సిరాజ్ శంషాబాద్‌ విమానాశ్రయంకు చేరుకోగానే అతడికి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి సిరాజ్ టోలిచౌక్‌లోని తన ఇంటికి చేరుకున్నాక.. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. ఆపై నేరుగా త‌న తండ్రి స‌మాధి ద‌గ్గ‌రికి వెళ్లి ప్రార్థించాడు.

హైదరాబాద్ చేరుకోగానే.. తండ్రి స‌మాధి ద‌గ్గ‌రకు వెళ్లిన సిరాజ్!!

Story first published: Friday, January 22, 2021, 7:55 [IST]
Other articles published on Jan 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+