ఈ ఐదేళ్ల ప్రయాణం చిరస్మరణీయం.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ భావోద్వేగం!
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న టీ దిలీప్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా తన ప్రయాణం ముగిసిందని, ఈ ఐదేళ్లు తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని పేర్కొన్నాడు.
హైదరాబాద్‌కు చెందిన టీ దిలీప్ 2021లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన హయాంలో జట్టులో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను ప్రవేశపెట్టి ఆటగాళ్లలో పోటీతత్వాన్ని పెంచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోయాయి.
అది నా మనసులో చిరస్థాయిగా ఉంటోంది..
ముఖ్యంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడటంతో టీ దిలీప్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించలేదు. దాంతో అతని స్థానంలో శుభదీప్ ఘోష్ నూతన ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే దిలీప్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నాడు. తనకు సహకరించిన కెప్టెన్లు, కోచ్‌లు, ఆటగాళ్లతో పాటు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపాడు.

'ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో చేరే ముందే.. నా సర్వస్వం ఇవ్వాలని భావించాను. తొలి రోజు నుంచి అదే లక్ష్యంతో పనిచేశాను. ఫీల్డింగ్ కోచ్‌గా జట్టుతో ప్రయాణం చేయడం పట్ల నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఫీల్డింగ్ మెడల్ అనేది మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మెడల్ ప్రదానం ద్వారా డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక ఆహ్లాదకర వాతావరణం సృష్టించాం.
మరిచిపోలేని జ్ఞాపకాలు..
ఫీల్డింగ్ కోచ్‌గా ఈ జ్ఞాపకాలు నా మదిలో ఎప్పటికి నిలిచిపోతాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, 2026, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2023, 2025 ట్రోఫీలు గెలిచిన భారత జట్టులో నేను భాగమే. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరిన జట్టులో కూడా ఉన్నాను. ఈ ప్రయాణం నాకెన్నో చిరస్మరణీయమైన జ్ఞపకాలను ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు.
నాపై నమ్మకం ఉంచి కొనసాగించిన రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్‌కు కృతజ్ఞతలు. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్లుగా ఉన్న సమయంలో భారత క్రికెట్‌కు నా వంతు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తున్నా.
ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతీ ఆటగాడు, కోచ్, సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడిక ఈ అధ్యాయం ముగిసిపోయింది. నా ప్రయాణం మాత్రం కొనసాగుతోంది.'అని టీ దిలీప్ ఏమోషనల్‌గా రాసుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

