Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారీ సిక్సర్లతో మహమ్మద్ షమీ విధ్వంసం..!(వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ బ్యాట్‌తో దుమ్మురేపాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఛండీఘడ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.

17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ అతను కొట్టిన రెండు భారీ సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. షార్ట్ పిచ్ బాల్‌తో పాటు వైడ్ యార్కర్‌ను షమీ అద్భుతంగా సిక్సర్లుగా మలిచాడు. ప్రస్తుతం ఈ షాట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Syed Mushtaq Ali Trophy Mohammed Shami smashes 17-ball 32 in Bengaluru

మహమ్మద్ షమీ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. మహమ్మద్ షమీతో పాటు కరణ్‌లాల్(25 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 33), ప్రదిప్తా ప్రమాణిక్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

చండీఘడ్ బౌలర్లలో జగ్‌జిత్ సింగ్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. రాజ్ బావా(2/27) రెండు వికెట్లు పడగొట్టాడు. నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భాగ్‌మెందర్ లాథర్ తలో వికెట్ తీసారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్దమవుతున్న షమీ.. బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. షమీ మోకాలి వాచినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినా.. అతని బ్యాటింగ్ చూస్తే ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

చీలమండ గాయంతో మహమ్మద్ షమీ గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా తరఫున ఆడాడు. సర్జరీ అనంతరం సుదీర్ఘ కాలం రెస్ట్ తీసుకున్న షమీ.. ఇటీవలే మళ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు. రంజీ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చిన అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.

Story first published: Monday, December 9, 2024, 13:58 [IST]
Other articles published on Dec 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+