Syed Mushtaq Ali Trophy: రోహిత్ శిష్యుడికి ప్రమోషన్.. జట్టులోకి సిరాజ్, సిటీ కమిషనర్ కొడుకు!

హైదరాబాద్: దేశవాళీ టీ20 టోర్నీ, ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) గురువారం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముంబై ఇండియన్స్ స్టార్, హైదరాబాద్ అండర్ 19 సంచలనం తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మకు హెచ్‌సీఏ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

సిరాజ్ కూడా...
ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్న టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. అయితే టీ20 ప్రపంచకప్ ఎంపికపై సిరాజ్ ఆడేది ఆధారపడి ఉంది. టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న సిరాజ్.. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అతనికి మహమ్మద్ షమీ, దీపక్‌చాహర్‌లతో తీవ్ర పోటీ నెలకొంది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోతే.. సిరాజ్ హైదరాబాద్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొననున్నాడు.

కమిషనర్ కొడుకు..
ఇక హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు సీవీ మిలింద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఆల్‌రౌండర్ అయిన చామ మిలింద్.. భారత అండర్ 19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తీసుకున్నా.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. దేశవాళీ టీ20 క్రికెట్‌లో 53 మ్యాచ్‌లు ఆడిన మిలింగ్.. 83 వికెట్లు తీసాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు అందుకోలేకపోయింది. 2009-10 సీజన్లో ఫైనల్ చేరినా.. మహారాష్ట్ర చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఆ టోర్నీ తర్వాత మరోసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. కనీసం ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలనుకుంటుంది.

జట్టు ఎంపికలోనూ..
అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే హెచ్‌సీఏ.. ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ అవకతవకలు పాల్పడుతుందనే విమర్శలు ఎప్పుడూ వస్తుంటాయి. ఇదే కారణంతోనే మాజీ కెప్టెన్ అంబటి రాయుడు జట్టును వదిలేసాడు. బంధుప్రీతీ, క్లబ్ మెంబర్స్ పిల్లలకే అవకాశాలిస్తారని, జిల్లా స్థాయిలో రాణించినవారికి ప్రతిభ కలిగిన వారికి అవకాశాలు ఇవ్వరనేది హెచ్‌సీఏపై వస్తున్న ప్రధాన ఆరోపణ. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విషయంలో నెలకొన్న గందరగోళంతో హెచ్‌సీఏకు ఉన్న పరువు కూడా పోయింది. ఈ క్రమంలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడం ఆ జట్టుకు ఎంతో ముఖ్యం.

హైదరాబాద్ జట్టు:
తన్మయ్ అగర్వాల్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), టీ రవితేజ, రాహుల్ బుద్ది, ప్రతీక్ రెడ్డి(కీపర్), సీవీ మిలింద్, మిఖిల్ జైస్వాల్, తనయ్ త్యాగరాజన్, ప్రగ్నయ్ రెడ్డి(కీపర్), రక్షణ్, సిరాజ్, చరణ్,భగత్, అలంకృత్, జయరాం, పున్నయ్య, త్రిశాంక్, సంకేత్, శ్రేయస్ పల్లా, నితేష్ రెడ్డి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications