Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో సంచలనం.. 20 ఓవర్లలో 349 రన్స్!

బరోడా జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో సంచలన రికార్డ్ నమోదు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్.

బరోడా జట్టులో భాను పనియా(51 బంతుల్లో 5 ఫోర్లు, 15 సిక్సర్లతో 134 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53), శివాలిక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 55), విష్ణు సోలంకి(16 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలు బాదారు.

Syed Mushtaq Ali Trophy Baroda score 349 in 20 overs Breaks world record for highest T20 total

ఈ మ్యాచ్‌లో బరోడా బ్యాటర్లు ఏకంగా 37 సిక్సర్లు బాదారు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగానూ బరోడా చరిత్ర సృష్టించింది. సిక్కిం బౌలర్లలో టమంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. తరుణ్ శర్మకు ఓ వికెట్ దక్కింది. అనంతరం సిక్కిం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 86 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

బరోడా బౌలర్లలో నినద్ రత్వా, మహేష్ పితియా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, అతిత్ షేత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్ తలో వికెట్ తీసారు. సిక్కిం బౌలర్ రోషన్ కుమార్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. టీ20 క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. అతను నాలుగో ఓవర్లు వేసి 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతను మోహిత్ శర్మ రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున మోహిత్ శర్మ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 73 పరుగులు సమర్పించుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక స్కోర్లు

1. బరోడా 349/5 వర్సెస్ సిక్కిం(ఇండోర్), 2024

2. జింబాబ్వే 344/4 వర్సెస్ గాంబియా(నైరోబి), 2024

3. నేపాల్ 314/3 వర్సెస్ మంగోలియా(హాంగ్జౌ) 2023

4.భారత్ 297/6 వర్సెస్ బంగ్లాదేశ్, హైదరాబాద్(2024)

5. సన్‌రైజర్స్ 287/3 వర్సెస్ ఆర్‌సీబీ(బెంగళూరు) 2024

6. జింబాబ్వే 286/5 సెయ్‌చెల్లెస్(నైరోబి) 2024

7. భారత్ 283/1 వర్సెస్ సౌతాఫ్రికా(జోహన్నెస్ బర్గ్) 2024

Story first published: Thursday, December 5, 2024, 13:01 [IST]
Other articles published on Dec 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+