SRH బ్యాటర్ విధ్వంసం.. 10 సిక్సర్లతో వీర విహారం!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్‌లో జార్ఖండ్ ఛాంపియన్‌గా నిలిచింది. హర్యానాతో గురువారం జరిగిన ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్.. 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 101) విధ్వంసకర శతకంతో జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జార్ఖండ్‌కు ఇదే తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ భారీ శతకానికి తోడుగా కుమార్ కుశాగ్ర(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, సుమంత్ జాఖర్ తలో వికెట్ తీసారు.
అనంతరం హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. యశ్వర్థన్ దలాల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. నిశాంత్ సింధు(31), సమంత్ జఖర్(38) రాణించినా ఫలితం లేకపోయింది. జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ కృష్ణ మూడేసి వికెట్లు తీయగా.. వికాస్ సింగ్, అంకుల్ రాయల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇషాన్.. తగ్గేదేలే..
ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. సెంచరీ అనంతరం తగ్గేదేలే అంటూ అతను చేసుకున్న సంబరాలు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాటేరమ్మ చిన్నకొడుకు చెలరేగడాని, కావ్య పాపను పట్టులేమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సరిగ్గా టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందే ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగడం చర్చనీయాంశమైంది.
భారత టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ తడబడుతుండటంతో ఇషాన్ కిషన్‌కు సెలెక్టర్లు అవకాశం ఇస్తారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనతో 22 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకొని మూడు ఫార్మాట్‌లు ఆడిన ఇషాన్ కిషన్.. ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు.
టీమిండియాలోకి రీఎంట్రీ..?
మానసిక స్థితి సరిగా లేదని జట్టు నుంచి తప్పుకోవడం అతని కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేయడంతో సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. సెంచరీతో మొదలుపెట్టిన ఇషాన్.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు.
దేశవాళీ క్రికెట్‌లో తిరిగి ఫామ్ అందుకున్న ఇషాన్.. రంజీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 517 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటే అతను న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications