ఆర్‌సీబీ బ్యాటర్ విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ రజత్ పటీదార్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81 నాటౌట్) విధ్వంసం కొనసాగుతోంది. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రజత్ పటీదార్.. ముంబైతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకపోయినా.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ముంబై ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. రజత్ పటీదార్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టోన్ డయాస్ చెరో రెండు వికెట్లు తీయగా.. అథర్వ అంకోలేకర్, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెద్గే తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అర్పిత్ గౌడ్(3)ను శార్ధూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి హర్ష్ గవిల్(2)ను ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో సుబ్రాన్ష్ సేనపతి, హర్‌ప్రీత్ సింగ్ ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో మధ్యప్రదేశ్ 2 వికెట్లకు 38 పరుగులే చేసింది.
హర్‌ప్రీత్ సింగ్‌ను అథర్వ పెవిలియన్ చేర్చగా.. నిలకడగా ఆడుతున్న సుబ్రాన్ష్‌ను శివమ్ దూబే ఔట్ చేశాడు. దాంతో మధ్యప్రదేశ్ 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్, వెంకటేశ్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేశ్ అయ్యర్ రోస్టన్ దియస్ ఔట్ చేశాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన రజత్ పటీదార్.. జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.
ఈ టోర్నీలో రజత్ పటీదార్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మధ్యప్రదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. అత్యధిక సిక్స్‌లు, బౌండరీలు బాదిన ప్లేయర్‌గానూ నిలిచాడు. ఢిల్లీతో జరిగిన సెమీఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీ బాదాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంపై ఆ జట్టు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లపై రజత్ పటీదార్ చెలాయిస్తున్న ఆధిపత్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్‌సీబీ కూడా రజత్ పటీదార్‌ను కొనియాడుతూ ట్వీట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications