Syed Mushtaq Ali Trophy 2022: ఇంపాక్ట్ రూల్ వాడుకొని గెలిచిన ఢిల్లీ.. ఓటమితో హైదరాబాద్ షురూ!

జైపూర్: ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు శుభారంభం చేసింది. బీసీసీఐ ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వాడుకొని ఆ జట్టు విజయాన్నందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం బరిలోకి దిగిన సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ చేయవచ్చు. ఈ కొత్త నిబంధన ప్రకారమే ఢిల్లీ ముందుగా హితెన్ దలాల్‌తో బ్యాటింగ్ చేయించింది.
అతను 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. ఇక ఫీల్డింగ్ సమయంలో హితెన్ దలాల్‌కు బదులు ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను ఆడించింది. అతను(2/13) రెండు వికెట్లతో సత్తా చాటి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా హృతిక్ షోకీన్ చరిత్రకెక్కాడు.

మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా..
ఈ ఇంపాక్ట్ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి సబ్‌స్టిట్యూట్‌గా ఆడించవచ్చు. అయితే ఈ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయవచ్చు. మ్యాచ్ జరుగుతుండగా.. ఫోర్త్ అంపైర్ లేదా.. ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి.
ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ కారణంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ముఖ్యంగా ఏ ఆటగాడైన తీవ్రంగా గాయపడి ఆడే లేని పరిస్థితులో ఉన్నప్పుడు ఆ జట్టుకు బాగా ఉపయోగపడనుంది.

ఐపీఎల్‌లోనూ..
ఈ టోర్నీలో ఈ నిబంధన సక్సెస్ అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నిబంధనతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. మణిపూర్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సరిగ్గా వాడుకుంది. ఓపెనర్ హితెన్ దలాల్ (47) చెలరేగడంతో మొదట ఢిల్లీ 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఛేదనలో హితెన్‌కు బదులు ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను ఆడించిన దిల్లీ లాభపడింది. షోకీన్ (2/13) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో మణిపుర్ 96/7కు పరిమితమైంది.

తిలక్ పోరాటం వృథా
ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌ను హైదరాబాద్ ఓటమితో మొదలుపెట్టింది. గ్రూప్-బి పోరులో 59 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడింది. మొదట పంజాబ్ 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (50), సన్వీర్ సింగ్ (55) రాణించారు. దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేసిన రక్షణ్ రెండు వికెట్లు తీయగా.. పున్నయ్య, రవితేజ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. తిలక్‌వర్మ (50) పోరాడినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications