Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే

ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సీజన్ నాకౌట్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం విడుదల చేసింది. జనవరి 26, 27 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్, 29న సెమీ ఫైనల్స్, 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లు కొత్తగా నిర్మించిన అహ్మదాబాద్‌లోని మొతెరాలోని సర్దార్ పటేల్ మైదానంలో జరగనున్నాయి.
కరోనా నేపథ్యంలో బయో బబుల్ మధ్య జనవరి 10న ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్ 1లో కర్ణాటక, పంజాబ్ తలపడనుంగా.. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ పోటీపడనున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో హరియాణాతో బరోడా, క్వార్టర్ ఫైనల్-4లో బిహార్‌తో రాజస్థాన్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఈ సీజన్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, ఆంధ్ర జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి.
షెడ్యూల్..
జనవరి 26న క్వార్టర్ ఫైనల్1: కర్ణాటక X పంజాబ్
జనవరి 26న క్వార్టర్ ఫైనల్2: తమిళనాడు X హిమాచల్ ప్రదేశ్
జనవరి 27న క్వార్టర్ ఫైనల్3: హరియాణా X బరోడా
జనవరి 27న క్వార్టర్ ఫైనల్4: బిహార్ X రాజస్థాన్
జనవరి 29
సెమీస్ 1: క్వాలిఫైయర్2 విన్నర్ X క్వాలిఫైయర్ 4
సెమీస్ 2 : క్వాలిఫైయర్1 విన్నర్ X క్వాలిఫైయర్3
జనవరి 31 ఫైనల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications