న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం ముందు కుర్రాళ్లకు పరీక్ష.. నేటి నుంచి ముస్తాక్ అలీ క్వార్టర్ ఫైనల్స్!

Syed Mushtaq Ali Trophy 2021: IPL stars who will play in the knockout stage

అహ్మదాబాద్: ఐపీఎల్‌ 2021 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న దేశవాళీ ప్లేయర్లకు సువర్ణావకాశం. నేటి(మంగళవారం) నుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సత్తా చాటితే ధనాధన్ లీగ్‌లో ఏదో ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఉండటంతో కుర్రాళ్లందరూ ఆసక్తిగా బరిలోకి దిగుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో కర్ణాటక మరోసారి టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తుండగా.. మిగతా ఏడు జట్లు కూడా మెరుగైన ప్రదర్శనపై దృష్టిపెట్టాయి.

మొత్తం 8 జట్లు నాకౌట్‌లో పాల్గొంటున్న టోర్నీ ఫస్ట్ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, పంజాబ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో పంజాబ్ ఐదు మ్యాచ్‌లు గెలిస్తే, కర్ణాటక నాలుగింటిలో నెగ్గింది. పంజాబ్ యంగ్ ఓపెనర్ ప్రభ్‌ సిమ్రన్ సింగ్, కర్ణాటక స్టార్ దేవదత్ పడిక్కల్‌పై భారీ అంనాలున్నాయి. ఇరు జట్లలో బలమైన మిడిలార్డర్ ఉండటంతో విజేతను అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మతో కూడిన పేస్ అటాక్ బలంగా ఉన్న పంజాబ్‌వైపు కాస్త మొగ్గు ఉంది.

అభిమన్యు మిథున్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా కర్ణాటక తరఫున సంచలనాలు నమోదు చేయడానికి సిద్దం అవుతున్నారు. సెకండ్ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు.. హిమాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది. జగదీశన్, దినేశ్ కార్తీక్, తమిళనాడుకు కీలకం కానున్నారు. బౌలింగ్‌లో కార్తీక్ త్యాగీ, ఎం అశ్విన్, ఆర్. సాయి కిశోర్, బాబా అపరాజిత్ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. హిమాచల్‌లో సందీప్ వారియర్, మహ్మద్, అశ్విన్ క్రిస్ట్ రెడీగా ఉన్నారు.

బుధవారం జరిగే థర్డ్ క్వార్టర్ ఫైనల్లో బరోడా.. హర్యానాతో, రాజస్థాన్.. బిహార్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. బరోడాకు పాండ్యా బ్రదర్స్ సేవలు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. దీంతో కెప్టెన్ కేదార్ దేవదర్‌పైనే భారం పడనుంది. ఇక ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, స్పిన్నర్లు చహల్, జయంత్.. హర్యానాకు కీలక ప్లేయర్లు.

Story first published: Tuesday, January 26, 2021, 12:45 [IST]
Other articles published on Jan 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X