Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sydney Test: పంత్ అరుదైన రికార్డు.. ఏకైక వికెట్ కీప‌ర్‌గా! ధోనీకి కూడా సాధ్యం కాలేదు!

Sydney Test: Rishabh Pant breaks record for most Test runs by Asian wicketkeeper in Australia
India vs Australia 3rd Test:Pant Breaks Record For Most Test Runs By Asian Wicketkeeper In Australia

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌.. మూడు పరుగుల వ్యవధిలో శతకం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ వేసిన 80 ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన పంత్‌.. బౌండరీ వద్ద పాట్ కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో టీమిండియా 250 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఏదేమైనా పంత్ అద్భుత ఇన్నింగ్స్‌కు అందరూ ఫిదా అయ్యారు.

ఆసియా వికెట్ కీప‌ర్‌గా

ఆసియా వికెట్ కీప‌ర్‌గా

ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లు టాప్ బ్యాట్స్‌మెన్‌కు కూడా ఓ స‌వాలే. ముఖ్యంగా స‌బ్‌కాంటినెంట్ బ్యాట్స్‌మెన్‌కు వ‌ణుకు పుట్టిస్తాయి. కానీ రిష‌బ్ పంత్ మాత్రం ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అలవోకగా పరుగులు చేస్తున్నాడు. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో పంత్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆసియా వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణీ పేరిట ఉన్న రికార్డును తాజాగా పంత్ అధిగ‌మించాడు. కిర్మానీ 471 ప‌రుగుల‌తో ఇప్పటివరకు టాప్‌లో ఉన్నాడు. 97 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో పంత్ అత‌న్ని మించిపోయాడు.

 నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక ప‌రుగులు

నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక ప‌రుగులు

తొలి ఇన్నింగ్స్‌లోనూ 36 ప‌రుగులు చేసిన రిషబ్ పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 97 ప‌రుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాలో టెస్టుల్లో మొత్తంగా 512 ప‌రుగుల‌తో టాప్‌లో ఉన్నాడు. టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీకి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇక ఆస్ట్రేలియాలో పంత్ స‌గ‌టు 56.88 గా ఉండ‌టం విశేషం. టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన జాబితాలో తొలి రెండు స్కోర్లు కూడా పంత్‌వే కావడం విశేషం. 2018లో ఇంగ్లండ్‌లో 114 ప‌రుగులు చేసిన పంత్‌.. తాజాగా ఆసీస్‌పై 97 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 2007లో ధోనీ చేసిన 76 ప‌రుగులు, 2016లో ఇంగ్లండ్‌పై పార్థివ్ ప‌టేల్ చేసిన 67 ప‌రుగులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఏకైక బ్యాట్స్‌మ‌న్‌గా

ఏకైక బ్యాట్స్‌మ‌న్‌గా

రిషబ్ పంత్ మ‌రో రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇది అత‌నికి మాత్ర‌మే సాధ్యమైంది. ఆస్ట్రేలియాలో 9 వ‌రుస టెస్టు ఇన్నింగ్స్‌లో 25, అంత‌కంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మ‌న్‌గా పంత్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల ఇన్నింగ్స్‌తోనే పంత్ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్ వాలీ హామండ్‌ను పంత్ అధిగ‌మించాడు. ఆస్ట్రేలియాలో చివ‌రి ప‌ది టెస్ట్ ఇన్నింగ్స్‌లో పంత్ వ‌రుస‌గా 25, 28, 36, 30, 39, 33, 159, 29, 36, 97 ప‌రుగులు చేయ‌డం విశేషం.

రికార్డు బ్యాటింగ్‌

రికార్డు బ్యాటింగ్‌

సిడ్నీ టెస్టులో పుజారా-రిషభ్‌లు నాల్గో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. నాల్గో ఇన్నింగ్స్‌లో నాల్గో వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా పుజారా-పంత్‌లు నిలిచారు. 1948-49లో ఈ రికార్డు రుసి మోడీ-విజయ్‌ హజారేల పేరిట ఉండేది. వీరు నాల్గో ఇన్నింగ్స్‌ నాల్గో వికెట్‌కు 139 పరుగుల్ని సాధించారు. దిలీప్ వెంగ్‌సర్కర్-యశ్‌పాల్ శర్మ 1979-80లో 122 రన్స్ చేశారు.

భారత్ మ్యాచ్ గెలుస్తుందని.. స్టీవ్ స్మిత్ చిల్ల‌రవేషాలు! ఏడాది నిషేధానికి గురైనా మారలేదుగా! (వీడియో)

Story first published: Monday, January 11, 2021, 11:51 [IST]
Other articles published on Jan 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+