Sydney Test: జాతీయగీతం ఆలపించే సమయంలో.. కన్నీరు పెట్టుకున్న మొహ్మద్ సిరాజ్(వీడియో)!!

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి (మొహ్మద్ గౌస్) గుర్తుచ్చాడో ఏమో.. కంట కన్నీరు పెట్టుకున్నాడు. సిరాజ్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మేము నీకు తప్పక అండగా ఉంటాం అంటూ ఫాన్స్ భరోసా ఇస్తున్నారు.
బాధను దిగమింగుకొని:
మొహ్మద్ సిరాజ్ తండ్రి మొహ్మద్ గౌస్ (53) గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇటీవల కన్నుమూసారు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో సిరాజ్ తండ్రి మృతి మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు సిరాజ్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. కాని తొలిసారి భారత టెస్ట్ జట్టుకు ఆడే అవకాశం దక్కడంతో పాటు క్వారంటైన్ నిబంధనల కారణంగా తాను స్వదేశానికి వెళ్ళేందుకు అంగీకరించలేదు. భారత్ వస్తే.. మళ్లీ ఆసీస్ వెళ్లాక క్వారంటైన్లోకి వెళ్లాలి. అలా అయితే టెస్ట్ మ్యాచ్ మిస్ అవుతాడు. అందుకే వెళ్లలేదు. తండ్రి మృతి చెందాడనే బాధను దిగమింగుకొని తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

తండ్రి గుర్తొచ్చి:
ఐపీఎల్ 2020 ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో తనకు దక్కిన అవకాశాన్ని మొహ్మద్ సిరాజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో (2/40, 3/37) ఐదు వికెట్స్ దక్కించుకున్నాడు. ఈ రోజు ప్రారంభం అయిన సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లోను సిరాజ్ ఆడుతున్నాడు. ఆసీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను 5 పరుగులకే పెవిలియన్ పంపి సత్తాచాటాడు. అయితే ఈ రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి గుర్తొచ్చి కంట కన్నీరు పెట్టుకున్నాడు.

బాక్సింగ్ డే టెస్ట్‌తో అరంగేట్రం:
మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌తో ఐదు రోజుల క్రికెట్‌లోనూ మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు అయిన సిరాజ్.. భారత జట్టుకు ఆడటం నిజంగా ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపే అంశం. అలాంటి క్రికెటర్ తొలి టెస్ట్ ఆడిన తన అనుభవాన్ని ఆ సమయంలోనే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పంచుకున్నాడు. శ్రీధర్ కూడా హైదరాబాదీ వాసే అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పక్కా హైదరాబాదీ యాసలో (హిందీలో మాట్లాడుకున్నా) మాట్లాడుకున్నారు. ఇది అభిమానులను అలరించింది.

24 ఏళ్ల తర్వాత:
హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడినా.. అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, రెండు టెస్టులు (సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆడుతున్నాడు) ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Sydney Test: అరగంట ముందే లంచ్ బ్రేక్.. కారణం ఇదే!!