'అవన్నీ తప్పుడు వార్తలు.. ఆసీస్ మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు'

మెల్‌బోర్న్: ఆసీస్ పర్యటనకు వెళ్లొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ, పాండ్యా కరోనా మహమ్మారి ఆంక్షలను ఉల్లంఘించారనే వార్తలు అబద్ధమని సిడ్నీలోని బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్ తాజాగా తెలిపారు. ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వారిద్దరినీ అసలు తాకలేదని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు స్టోర్‌కు వచ్చినప్పుడు ఆంక్షలే లేవని పొంగ్రాస్ చెప్పుకొచ్చారు.

20 రోజులు తర్వాత
గత ఏడాది డిసెంబర్ 7న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సిడ్నీలోని బేబీ షాప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు మాస్కుల్లేకుండా చిత్రాలు దిగారు. దాదాపుగా 20 రోజులు తర్వాత ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో వారు కరోనా ఆంక్షలు, బయో బుడగ నిబంధనలు ఉల్లంఘించారని ఆస్ట్రేలియా మీడియా ప్రచారం చేసింది. అంతకుముందు రోజు రోహిత్ శర్మ, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ ఓ రెస్టారెంట్లో భోజనం చేయడం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కూడా ఆస్ట్రేలియా మీడియా పెద్ద రాద్దాంతం చేసింది.

అసలు ఆంక్షలే లేవు
తాజాగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో చిత్రాలు దిగడంపై బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్ స్వయంగా స్పందించారు. ఆసీస్ మీడియా వార్తలు అబద్ధమని ఆమె కొట్టిపారేశారు. 'కోహ్లీ, పాండ్యా మా స్టోర్‌కు వచ్చి కొంత సమయం గడిపారు. ఆ సమయంలో న్యూసౌత్ వేల్స్‌లో అసలు ఆంక్షలే లేవు. మేం కోహ్లీ,పాండ్యాకు బహుమతులు ఇవ్వాలనుకున్నాం. కానీ వారు అన్నింటికీ బిల్లు చెల్లించారు. వారు అత్యంత ఓపికతో మాతో సమయం గడిపారు. మా స్టోర్ ఉద్యోగుల కోరిక మేరకు ఎంతో ఓపికగా ఫొటోలు దిగారు. వారిద్దరినీ అసలు స్పర్శించనివ్వలేదు' అని పొంగ్రాస్ తెలిపారు.

ఇలా చేయడం సిగ్గుచేటు
'మా కుటుంబ సభ్యులతో ఈ అనుభవం పంచుకోవాలనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో ఫొటోలు దిగాం. వారు మా స్టోర్‌కు వచ్చారని గర్వంగా చెప్పుకొనేందుకే సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టాం. కానీ వాటితో ఆసీస్ మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు' అని బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్ అన్నారు. ఇక రిషబ్ పంత్ ఓ అభిమానిని హగ్ చేసుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమయిన క్రికెట్ ఆస్ట్రేలియా అందరినీ ఐసోలేషన్‌లోకి పంపింది. అయితే పంత్ తనను హగ్ చేసుకోలేదని, ఎదో ఆనందంలో హగ్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఆ అభిమాని తర్వాత స్పష్టం చేశాడు. మొత్తానికి రెండు వివాదాలకు తెరపడింది.

మూడు టెస్టులకు దూరం
తన భార్య అనుష్క శర్మ మరికొద్ది రోజుల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమయిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకొని హార్దిక్ కూడా భారత్ వచ్చేశాడు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆసీస్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది.
శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘనవిజయం.. రెండేళ్లలో ఇదే తొలి టెస్టు సిరీస్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications