For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: 24 బంతుల్లో 20 డాట్‌బాల్స్.. చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ బౌలర్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మిస్టరీ స్పిన్నర్ సుయాశ్ శర్మ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సుయాశ్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సుయాశ్ శర్మ 20 డాట్ బాల్స్ వేసాడు. ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు 7 పరుగులే ఇచ్చాడు. ఇందులో నాలుగు సింగిల్స్ ఉండగా.. మరో మూడు వైడ్లు ఉన్నాయి.

ఈ క్రమంలో సుయష్ శర్మ.. రవిచంద్రన్ అశ్విన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2010 సీజన్‌లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున డెక్కన్ ఛార్జర్స్‌పై 18 డాట్ బాల్స్ వేసాడు. 2014లో ఆర్‌సీబీపై సీఎస్‌కే తరఫున మరోసారి అశ్విన్ 18 డాట్ బాల్స్ వేయగా.. 2013లో ఆర్‌సీబీ తరఫున సీఎస్‌కే యుజ్వేంద్ర చాహల్ కూడా 18 డాట్ బాల్సే వేసాడు.

నా మాటలు కోహ్లీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించవచ్చు.. కానీ నిజం ఇదే: సంజయ్ మంజ్రేకర్నా మాటలు కోహ్లీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించవచ్చు.. కానీ నిజం ఇదే: సంజయ్ మంజ్రేకర్

పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ చాహర్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 18 డాట్ బాల్స్ వేయగా.. సీఎస్‌‌కే తరఫున ఇమ్రాన్ తాహిర్.. ఆర్‌సీబీపై 18 డాట్ బాల్స్ వేసాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్ కూడా 18 డాట్ బాల్స్ వేసారు.

IPL 2026 Suyash Sharma Makes History First Spinner to Bowl 20 Dot Balls in an IPL Match

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.

అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

IPL 2026: ఆర్‌సీబీ భారీ విజయం.. రెట్టింపు అయిన రన్‌రేట్!IPL 2026: ఆర్‌సీబీ భారీ విజయం.. రెట్టింపు అయిన రన్‌రేట్!

Story first published: Tuesday, April 28, 2026, 21:53 [IST]
Other articles published on Apr 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+