For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 WC 2024: ఐసీసీ అత్యుత్తమ క్యాచ్‌గా.. సూర్య స్టన్నింగ్ క్యాచ్! (వీడియో)

టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా.. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఈ క్యాచ్‌కు సంబంధించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియాకు విజయాన్ని అందించిన ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చసాగింది.

ఈ క్యాచ్‌పై కొందరు సందేహాలు వ్యక్తం చేయగా దిగ్గజ ఆటగాళ్లు తిప్పికొట్టారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ).. సూర్య క్యాచ్‌ను ప్రశంసించింది. ఈ టోర్నీలోనే అత్యుత్తమ క్యాచ్‌గా పేర్కొంది. ఈ మేరకు బుధవారం సూర్య క్యాచ్‌ను టీ20 ప్రపంచకప్ 2024 అత్యుత్తమ క్యాచ్‌ల జాబితాలో చేర్చినట్లు అధికారికంగా ప్రకటించింది.

Suryakumar Yadav s Stunning Catch Headlines ICC s Top Picks For best catches of T20 World Cup 2024

టీ20 ప్రపంచకప్‌ 2024కు సంబంధించిన స్టన్నింగ్ క్యాచ్‌ల వీడియోను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. భారత్ నుంచి ముగ్గురు ఫీల్డర్లు ఈ టోర్నీలో బెస్ట్ క్యాచ్‌లు అందుకున్నారు. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై అక్షర్ పటేల్ అందుకున్నాడు. అమెరికాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో బౌండరీ లైన్‌పై సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

సౌతాఫ్రికాతో ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ టర్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్య స్టన్నింగ్ క్యాచ్‌తో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో ఫుల్‌టాస్‌గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.

దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య.. తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతిని గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకొని క్యాచ్ పూర్తి చేశాడు.

ఈ క్యాచ్ అందుకోవడంలో సూర్య ఏ మాత్రం తప్పిదం చేసినా టీమిండియా ఓటమిపాలయ్యేది. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకడని, బౌండరీ లైన్‌ను వెనక్కు జరిపారని కొందరు నెటిజన్లు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ అసత్య ఆరోపణలనే విషయం స్పష్టమైంది.

Story first published: Wednesday, July 3, 2024, 21:04 [IST]
Other articles published on Jul 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+