For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై సూర్యకుమార్ యాదవ్ సెటైర్స్! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన ఆర్‌సీబీ స్పిన్నర్

Suryakumar Yadav troll Yuzvendra Chahal batting on Instagram

సిడ్నీ: యుజ్వేంద్ర చాహల్ ఈజ్ బ్యాక్.. సోషల్ మీడియా వేదికగా తన కోతి వేశాలను ఈ టీమిండియా లెగ్ స్పిన్నర్ మళ్లీ మొదలుపెట్టాడు. ఈ మధ్యే ధనుశ్రీ అనే యూట్యూబర్‌తో నిశ్చితార్థం చేసుకున్న చాహల్.. బుద్దిగా ఉంటున్నాడులే అనుకుంటున్న క్రమంలో.. మరోసారి తనలోని పాత చాహల్‌ను బయటకు తీశాడు. సోషల్ మీడియా వేదికగా తనదైన పోస్ట్‌లతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ ఆర్‌సీబీ స్పిన్నర్ గురువారం తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. దీనికి 'ఈ సారి పరుగులు చేస్తా'అనే క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఈ వీడియోపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్, అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ తమదైన కామెంట్లతో వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ఈ కామెంట్స్ అన్నిటికి చాహల్ తనదైన శైలిలో దిమ్మతిరిగే సమాధానాలిచ్చాడు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్‌కు అదిరిపోయే కౌంటరిచ్చాడు. చాహల్ బ్యాటింగ్‌ చేయడాన్ని ట్రోల్ చేస్తూ.. 'భయ్యా నీ నుంచి నేను బ్యాట్ తీసుకోవాలి'అని కామెంట్ చేశాడు. దీనికి చాహల్ కూడా 'తీసుకుందువులే.. 10వేల పరుగులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి చేశాక ఇస్తాలే'అని తనదైన రీతిలో బదులిచ్చాడు.

ఇక 'చాహల్‌.. ఫాస్ట్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కొంటున్నావా? 'అని స్టెయిన్ కామెంట్ చేయగా.. అది సీక్రెట్ సర్ అని చెప్పిన చాహల్.. 'బాగుంది యుజీ.. కానీ మనమిద్దం బౌలర్లం కదా'అని కామెంట్ చేసిన రషీద్‌కు హహహ అని బదులిచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌‌లో చాహల్ 21 వికెట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌లోని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపికైన చాహల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నవంబర్ 27న ఆతిథ్య ఆసీస్‌తో కోహ్లీసేన తొలి వన్డే ఆడనుంది.

Suryakumar Yadav troll Yuzvendra Chahal batting on Instagram
Story first published: Friday, November 20, 2020, 8:31 [IST]
Other articles published on Nov 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+