సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుంది టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. టీమిండియా టీ20 టీ20 కెప్టెన్సీ బాధ్యతలతో పాటు జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ కూడా వేటు వేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ అన్ ఫాలో చేయడం, సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఇన్‌స్టా బయోలో..
అంతేకాకుండా సూర్య తన ఇన్‌స్టా బయో నుంచి ముంబై ఇండియన్స్, ముంబై అనే పదాలను తొలగించాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను సూర్య డిలీట్ చేశాడు. అలాగే తన ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చేశాడు.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌తో సూర్యకుమార్ యాదవ్ బంధం ముగిసిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ముంబై ఇండియన్స్ గానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

2018 నుంచి..
ఐపీఎల్ 2018 సీజన్‌కు ముందు సూర్య కుమార్ యాదవ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆ జట్టు తరఫున అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. ముంబై ఇండియన్స్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు.
ఐపీఎల్ 2025 వరకు సూర్య తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. కానీ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పేలవ ప్రదర్శనతోనే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయాడు. ముంబై ఇండియన్స్ కూడా అతన్ని వదులుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది.
పాపం సూర్య..
అయితే టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. ఫామ్‌లో లేకపోయినా.. టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన ఆటగాడిని తప్పించడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా సత్తా చాటాడు కదా? అని ప్రశ్నించాడు. బీసీసీఐ నిర్ణయంతో సూర్యకుమార్ యాదవ్ చాలా బాధపడి ఉంటాడని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

