Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను అంత గలీజ్ గాన్ని కాదు భయ్యా.. బుడ్డోడా దుమ్మురేపు: సూర్యకుమార్ యాదవ్

సోషల్ మీడియా వేదికగా తన పేరిట అసత్య ప్రచారం జరుగుతుందని టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు‌కు వ్యతిరేకంగా తాను అనని మాటలు అన్నట్లు ఓ స్టేట్‌మెంట్‌ను ప్రచారం చేస్తున్నారని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సూర్య స్పష్టం చేశాడు. తాను జట్టులో ఉన్నా లేకున్నా.. తన మద్దతు ఎప్పుడూ టీమిండియాకే ఉంటుందని తెలిపాడు. తనకు కెప్టెన్‌గా గొప్ప అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు, జట్టుపై విమర్శలు గుప్పించేంత సంకుచిత మనస్తత్వం తనది కాదని చెప్పాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్ ప్రదర్శన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినసెలెక్టర్లు.. జట్టులో కూడా అతనికి చోటివ్వలేదు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అతని సారథ్యంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028 కోసం కొత్త జట్టును నిర్మిస్తున్నారు.

Suryakumar Yadav Slams Fake Statement Circulating Online Appreciates Team and Welcomes Vaibhav Sooryavanshi

అది ఫేక్ పోస్ట్..

అయితే టీమిండియా సెలెక్టర్లపై సూర్యకుమార్ యాదవ్ విమర్శలు గుప్పించినట్లుగా ఓ ఫేక్ పోస్ట్‌ను కొందరు ఆకతాయిలు సర్క్యూలేట్ చేశారు. ' టీమిండియా మేనేజ్‌మెంట్ నా భవిష్యత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది నన్ను బాగా బాధించింది. ప్రపంచకప్ విజయం తర్వాత నేనే కెప్టెన్‌గా కొనసాగుతానని సెలెక్టర్లు హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో నన్ను జట్టు నుంచి కూడా తప్పించారు. నాకు కనీస మర్యాద ఇవ్వలేదు. జట్టు విజయం కోసం నేను పడ్డ కష్టాన్ని మర్చిపోయారు.

నాకు మరో అవకాశం లేకుండా లేకపోయింది. కానీ నా అవసరం వారికి లేదనే రియాల్టీని నేను అంగీకరించాను.'అని సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఎక్స్ వేదికగా ఓ ఫేక్ పోస్ట్ సృష్టించి వైరల్ చేశారు. సూర్య ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను అతని దృష్టికి తీసుకెళ్లగా.. ఇది ఫేక్ అని తేల్చాడు. మరో పోస్ట్‌లో టీమిండియాకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశాడు.

బుడ్డోడా చెలరేగు..

'భారత టీ20 జట్టు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వారికి ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఆటగాళ్లు తమ శక్తినంతా ధారపోస్తున్నారని నాకు తెలుసు. వారికి ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది. వైభవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బుడ్డోడా.. నువ్వు అద్భుతమైన ప్రయాణానికి ప్రారంభంలో ఉన్నావు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. దేశం గర్వపడేలా ఆడుతూనే ఉండు. నా పేరుతో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఒక ఫేక ప్రకటన నా దృష్టికి వచ్చింది.

నేను అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాను. దయచేసి ఈ ఫేక్ పోస్ట్‌ను నమ్మవద్దు. షేర్ చేయవద్దు. భారత క్రికెట్‌కు, నా సహచరులకు, ఈ ఆటకు నా తరఫున ఉండే మద్దతు... నా పేరుతో తప్పుగా ప్రచారంలో ఉన్న మాటల కంటే గట్టిగానే వినిపిస్తుంది' అని సూర్యకుమార్ యాదవ్ తన ప్రకటనలో స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, July 7, 2026, 17:41 [IST]
Other articles published on Jul 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+