Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Suryakumar Yadav: వాంఖడేలో పులి.. ఇతర మైదానాల్లో పిల్లి!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తనకే సాధ్యమైన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 360 డిగ్రీల ఆటతో చూడముచ్చటైన షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమర్ యాదవ్.. 4 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 479 పరుగులు చేశాడు.

యావరేజ్ 43.55గా ఉండగా.. స్ట్రైక్‌రేట్ 190.84గా ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సూర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ శతకాన్ని అందుకున్నాడు.

Suryakumar Yadav scoring only wankhede stadium

ఐపీఎల్ 2023 టోర్నీకి ముందు ఆరంభంలో తీవ్రంగా ఇబ్బందిపడిన సూర్య.. కోల్‌కతాతో జరిగిన మూడో మ్యాచ్‌లో లయ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌ నుంచి తన జోరును కొనసాగిస్తున్నాడు. అయితే వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనే సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం చర్చనీయాంశమైంది. మిగతా మైదానాల్లో మాత్రం అతను దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్య 15 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా.. ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దాంతో పేలవ ఫామ్‌ కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ వాంఖడే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 43 పరుగులతో టచ్‌లోకి వచ్చిన సూరీడు.. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులకే వెనుదిరిగాడు.

Suryakumar Yadav scoring only wankhede stadium

పంజాబ్ కింగ్స్‌తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులతో ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన సూర్య.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులకే ఔటయ్యాడు. ఆ వెంటనే వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 55 హాఫ్ సెంచరీ సాధించాడు. చెన్నైతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూర్య 26 పరుగులకే వెనుదిరిగాడు.

ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌లతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో సూరీడు 83, 103 నాటౌట్‌తో సత్తా చాటాడు. ప్రత్యర్థి మైదానాల్లో మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ మినహా.. ఇతర మైదానాల్లో సూర్య రాణించిందేం లేదు. దాంతో వాంఖడేలో పులి అయిన సూరీడు.. ఇతర మైదానాల్లో మాత్రం పిల్లిలా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Sunday, May 14, 2023, 18:12 [IST]
Other articles published on May 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+