కోహ్లీ స్లెడ్జింగ్ వేరే లెవెల్.. భయంతో బ్యాటింగ్ చేసా: సూర్యకుమార్ యాదవ్

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ గురించి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కోహ్లీ తనను కవ్వించిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ స్లెడ్జింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. నాటి మ్యాచ్‌లో కోహ్లీ కవ్వింపులతో తాను భయంతో బ్యాటింగ్ చేసానని చెప్పుకొచ్చాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్'యూట్యూబ్ షోలో సూర్యకుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ స్లెడ్జింగ్ వేరే లెవెల్..
ఇప్పటివరకు ఈ విషయంపై బయట చర్చించలేదని చెప్పిన సూర్య.. ఆ రోజు తలదించుకునే బ్యాటింగ్ చేశానన్నాడు. 'విరాట్ కోహ్లీది విభిన్నమైన వ్యక్తిత్వం. గ్రౌండ్లో ఉన్నప్పుడు అతని స్టైల్, ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లను కన్ఫూజ్ చేస్తాడు. రెండు జట్లకు నాటి మ్యాచ్ చాలా ముఖ్యం. ఓడిన జట్టు ఇంటికి, గెలిచిన జట్టు టోర్నీలో ముందు అడుగు వేస్తుంది.

గట్టిగా అనుకున్నా..
ఆ మ్యాచ్‌లో కోహ్లీ స్లెడ్జింగ్ మరో స్థాయిలో ఉంది. నేను మాత్రం.. ఏం జరిగినా మ్యాచ్ గెలిపించాలని అనుకున్నా. కోహ్లీ నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మేమిద్దరం చూయింగ్ గమ్ నములుతున్నాం. 'ఏం జరిగినా ఒక్క మాట మాట్లాడకు. 10 సెకన్లు ఓపిక పట్టు. ఇంకో ఓవర్ మొదలవుతుంది' అంటూ నాకు నేను చెప్పుకున్నా. అప్పుడే నా బ్యాట్ కింద పడిపోయింది. అది నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు కోహ్లీని చూడలేదు. కిందకు చూస్తూ బ్యాటింగ్ కొనసాగించా.' అని సూర్య చెప్పుకొచ్చాడు.

ముంబై చాంపియన్..
ఆర్‌సీబీతో జరిగిన నాటి మ్యాచ్‌లో సూర్య 43 బంతుల్లోనే 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకపోయింది.
గత కొన్నేళ్లుగా ముంబై తరఫున సూర్యకుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై వరుస ఓటములు మూటగట్టుకుంటున్నప్పటికీ.. సూర్య మాత్రం అలవోకగా పరుగులు చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications