Surya Kumar Yadav: అది నా భార్య పుట్టిన రోజుకు ట్రెంట్ బౌల్ట్ ఇచ్చిన గిఫ్ట్!

జైపూర్: తాను ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసి న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. తన సతీమణి బర్త్‌డేకు గిఫ్ట్ ఇచ్చాడని టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. అయితే సూర్యకుమార్ యాదవ్ 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనిచ్చిన సునాయస క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.

ఎప్పటిలానే ఆడా..
ఈ మ్యాచ్ అనంతరం ఈ క్యాచ్ డ్రాప్‌పై స్పందించిన సూర్య.. ఫన్నీ కామెంట్స్ చేశాడు. తన సతీమణి బర్త్‌డేకు బౌల్ట్ గిఫ్ట్ ఇచ్చాడని చమత్కరించాడు. 'ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏమీ చేయలేదు. గత మూడు, నాలుగేళ్లుగా ఎలా ఆడుతున్నానో అలాగే బ్యాటింగ్ చేశా. నెట్స్‌లో ఎలాంటి సాధన చేస్తున్నానో దాన్నే మైదానంలోనూ పునరావృతం చేశాను. నా ఆట తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటాను. ఎలా ఆడితే మంచిదో ఆలోచిస్తాను. ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావంతో బంతి తేలిగ్గానే బ్యాట్ పైకి వచ్చింది.దాంతో షాట్లు ఆడటం తేలికైంది.

మంచి బహుమానం..
చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనే స్వయంగా ఈ మ్యాచ్‌ని గెలిపించి ఉంటే మరింత ఎక్కువగా ఆనందించేవాడిని. కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచే మనం నేర్చుకొని ముందుకు సాగుతాం. ఇక బౌల్ట్ నా క్యాచ్‌ను వదిలేసిన విషయానికి వస్తే.. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. ఆమెకు అతడిచ్చిన సరైన బహుమానం అనుకుంటున్నా'' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

రోహిత్, సూర్య సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్ చాప్‌మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications