Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: సంజూ శాంసన్ కంటే అతనే సరైనోడు: సూర్యకుమార్ యాదవ్

సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. మంగళవారం కటక్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాల సన్నదమైంది. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు.

ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు కొనసాగుతాయని స్పష్టం చేశాడు. ఓపెనింగ్ స్థానానికి సంజూ శాంసన్ కంటే శుభ్‌మన్ గిల్ సరైనవాడని అభిప్రాయపడ్డాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనింగ్ జోడీ తప్పా.. ఏ స్థానాలు ఆటగాళ్లకు స్థిరంగా ఉండవని తెలిపాడు.

'ఈ సిరీస్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు జరుగుతాయి. మూడో స్థానం నుంచి ఆరో బ్యాటర్ వరకు ఆటగాళ్లు మారుతూనే ఉంటారు. ఓపెనర్లు తప్పా మరే ఆటగాడికి స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఉండదు. మా జట్టులో ఏ స్థానంలోనైనా రాణించగలిగే ప్రతిభావంతులు ఉన్నారు. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. తొలి టీ20లో తిలక్ వర్మ ఆరో స్థానంలో ఆడవచ్చు. శివమ్ దూబే మూడో స్థానంలో బరిలోకి దిగవచ్చు. మా జట్టు విధానం ఇదే.

Suryakumar Yadav Says Shubman Gill Deserved T20I Opener Spot Ahead of Sanju Samson

ప్రస్తుతం మా టీమ్ చాలా బలంగా ఉంది. సంజూ శాంసన్ విషయానికొస్తే.. అతను ఓపెనర్‌గా పరుగులు చేశాడు. కానీ అతని కంటే ముందు గిల్ ఓపెనర్‌గా ఆడాడు. కాబట్టి ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ప్రాధాన్యత ఇస్తాం. అందుకు గిల్ పూర్తి అర్హుడు. సంజూ శాంసన్‌కు మేం చాలా అవకాశాలు ఇచ్చాం. అతను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. సంజూ వంటి ఆటగాళ్ల వల్ల కెప్టెన్‌గా నా పని మరింత సులువు అవుతుంది. ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండటం మా జట్టు బలం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీ20ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. అదే దూకుడు కనబర్చాలని భావిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు దిమ్మతిరిగే షాకివ్వాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. దాంతో ఈ తొలి టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Monday, December 8, 2025, 17:33 [IST]
Other articles published on Dec 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+