For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఫ్రాంచైజీకి ఆడటమే నా కెరీర్ టర్నింగ్ పాయింట్.. గల్లీ క్రికెట్‌తోనే 360 ఆట: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav says Mumbai Indians and my wife Devisha are my two pillars

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడటమే తన కెరీర్ మలుపు తిప్పిందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. టాపార్డర్ బ్యాటర్‌గా ముంబై ఇండియన్స్ ప్రమోషన్ ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు. టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఓ కలలా అనిపిస్తోందని చెప్పిన సూర్య.. గల్లీ క్రికెట్‌తోనే 360 డిగ్రీల ఆటను నేర్చుకున్నానని చెప్పాడు.

తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సూర్య.. తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయడమే తన డ్రీమ్‌గా చెప్పిన సూర్య.. దేవిషాను చేసుకున్న తర్వాత తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రోత్సాహం కూడా తన సక్సెస్‌కు ప్రధాన కారణమని తెలిపాడు.

ముంబై ఇండియన్స్‌తోనే మలుపు..

ముంబై ఇండియన్స్‌తోనే మలుపు..

'విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవడం నా అదృష్టం. క్రికెట్‌లో విజయవంతం కావడంలో ఈ స్టార్లు స్పూర్తిగా నిలిచారు. విరాట్‌ భాయ్‌తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. ఇక రోహిత్‌ పెద్ద అన్న లాంటోడు. ఏ అనుమానం ఉన్నా వెంటనే అడిగేస్తా. ఐపీఎల్‌లో (2018) ముంబై ఇండియన్స్‌లో చేరిన దగ్గర నుంచి అతను మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా రావాలన్న కోరిక ఉండేది. నా మీద భరోసా ఉంచి ముంబై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ బాధ్యతను అప్పగించింది.

కెరీర్‌లో ఇదే పెద్ద మలుపు. ఇక 2016లో దేవీషాను వివాహం చేసుకున్న తర్వాత అంతా కలిసొచ్చింది. ప్రతి ప్రణాళికల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ. అందుకే ఎక్కడికి వెళ్లినా నా భార్యను వెంట తీసుకెళ్లేవాడిని. ప్రయాణం కుదరదు అన్నా కూడా లాక్కెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దేవిషా తెచ్చిన సమతూకం అలాంటిది. విఫలమైనప్పుడు ఆమె సహచర్యమే పెద్ద ఆదరణ.

360 ఆట.. అలా నేర్చుకున్నా..

360 ఆట.. అలా నేర్చుకున్నా..

360 డిగ్రీల్లో షాట్లు ఆడడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పాఠశాల, కళాశాల రోజుల్లో క్రికెట్‌ అంతా ఎక్కువగా రబ్బరు బంతితోనే ఆడేవాడిని. వర్షంలోనే ఎన్నో మ్యాచ్‌లు ఆడేవాళ్లం. ఇలాంటప్పుడు బంతి ఇష్టం వచ్చినట్లు దూసుకొచ్చేది. బౌన్స్‌ అవుతూ ఎక్కువ ఎత్తులో వెళ్లేది. అందులోనూ లెగ్‌సైడ్‌ బౌండరీ దూరంగా ఉండేది. అదే ఆఫ్‌సైడ్‌ దగ్గరగా ఉండేది.

ఆఫ్‌సైడ్‌ ఫోర్లు కొట్టకుండా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బంతులు వేసేవాళ్లు. ఈ సమయంలోనే భిన్నమైన టెక్నిక్‌లు నేర్చుకున్నా. క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ.. శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ స్విచ్‌ షాట్లు, రివర్స్‌ స్వీప్‌లు, అప్పర్‌ కట్‌లతో బౌండరీలు కొట్టేవాడిని. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే ఆట ఉపయోగపడింది. నెట్స్‌లో మాత్రం ఇలా ఆడను. సంప్రదాయబద్ధంగా పద్ధతిగా సాధన చేస్తా. బంతి బ్యాట్‌లో స్వీట్‌ స్పాట్‌కు తాకిందా లేదా అనే చూసుకుంటా.

టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్..

టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్..

టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌.. ఈ ట్యాగ్‌ను నమ్మలేకపోతున్నా. ఏడాది క్రితం ఇదో కల. టీ20ల్లో ఆడటం మొదలుపెట్టినప్పుడు అత్యుత్తమంగా రాణించాలని అనుకున్నా. అందుకోసం కఠోరంగా శ్రమించా. ఇప్పుడు ప్రతిఫలం వస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌పై కూడా దృష్టి పెడుతున్నా. ఇందుకోసం గేమ్‌లో మార్పులేమి చేసుకోను.

ఏ ఫార్మాట్‌ ఆడినా ఒకటే ఆట. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా అంతే. బరిలో దిగితే అలరించడమే నా పని. ఆట స్వరూపాన్ని మార్చేవాడిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటా. 40-50 బంతుల్లోనే చేయాల్సింది చేయమని జట్టు కోరుకుంటున్నప్పుడు 100 బంతులు ఆడడం ఎందుకు?

పదేళ్లు దేశవాళీలో..

పదేళ్లు దేశవాళీలో..

టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కెరీర్‌ ఆరంభం నుంచి ఆడింది ఎర్ర బంతితోనే. రోజుకో మలుపు తిరుగుతూ సవాల్‌ను విసిరే ఐదు రోజుల ఆట అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియాతో రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో జట్టు కోరుకుంటే సేవలందించడానికి సిద్ధం. టీమిండియా తరఫున అరంగేట్రం చేయడానికి ముందు పదేళ్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడా.

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బెరుకు లేకుండా బ్యాటింగ్‌ చేయడానికి కారణం ఇదే. దేశవాళీలో ఎంతగా రాణించినా సెలక్టర్ల నుంచి పిలుపు రాకపోవడం నిరాశ కలిగించింది. కానీ కష్టపడితే ఏదో ఒకరోజు జట్టులోకి రావడం ఖాయమని అనుకున్నా.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, December 27, 2022, 10:23 [IST]
Other articles published on Dec 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+