Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సూర్యకుమార్ యాదవ్

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.

ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ అసాధారణ బౌలింగ్‌తో జట్టును విజయం ముంగిట నిలబెట్టాడని ప్రశంసించాడు. 'ఎప్పుడైనా సరే ఎంత లక్ష్యం నమోదు చేసినా తిరిగి ఇవ్వాల్సిందే. టీ20ల్లో 125, 140 స్కోర్లతో గెలవడం కష్టం. కానీ మా బౌలర్ల పోరాట పటిమను చూసి గర్వపడుతున్నా. 125 పరుగుల లోస్కోరింగ్ గేమ్‌లో లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒకరు ఐదు వికెట్లు తీయడం గొప్ప విషయం.

Suryakumar Yadav says in a T20 game you don t want to get 125 or 140 after SA beat IND in 2nd T20I

వరుణ్ చక్రవర్తీ బౌలింగ్ అసాధారణం. బౌలింగ్‌పై అతను చాలా హర్డ్ వర్క్ చేశాడు. అతని ఐదు వికెట్ల ఘనతను ప్రతీ ఒక్కరు ఆస్వాదించారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. మరో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిని గెలిచే ప్రయత్నం చేస్తాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్), అక్షర్ పటేల్(21 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ, అండిలే సిమెలెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 7 వికెట్లకు పరుగులు చేసి గెలుపొందింది. ట్రిస్టన్ స్టబ్స్( 41 బంతుల్లో 7 ఫోర్లతో 47 నాటౌట్), హెండ్రీక్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/17) ఐదు వికెట్ల ఘనత సాధించగా.. రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.

వరుణ్ చక్రవర్తీ సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయం దిశగా సాగింది. సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 37 పరుగులు అవసరమవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన 17వ ఓవర్‌లో స్టబ్స్ 6, 4తో 12 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇచ్చిన సిక్సర్‌తోనే మ్యాచ్ భారత్ చేజారింది. స్లాట్‌లో బంతిని వేయడంతో స్టబ్స్ భారీ సిక్సర్‌గా మలిచాడు.

Story first published: Monday, November 11, 2024, 0:04 [IST]
Other articles published on Nov 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+