For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు బంతి విసిరేద్దామనుకున్నా: సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ చుట్టే చర్చ జరుగుతోంది. అసాధారణ క్యాచ్‌తో సూర్య మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దాంతో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

బౌండరీ లైన్‌పై సూర్య పట్టిన ఈ కళ్లు చెదిరే క్యాచ్... క్రికెట్ చరిత్రలోనే ఓ బెస్ట్‌ క్యాచ్‌గా నిలిచిపోనుంది. అయితే ఈ క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. ఈ క్యాచ్‌‌పై కొందరు అభిమానులు సందేహం వ్యక్తం చేస్తూ వివాదాం చేసే ప్రయత్నం చేసారు. బంతి అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకడని ఆరోపించారు. బౌండరీ లైన్‌ను కూడా వెనక్కి జరపారన్నారు. అయితే ఈ విమర్శలను సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం షాన్ పొలాక్ తిప్పికొట్టాడు. క్లియర్ క్యాచ్ అని స్పష్టం చేశాడు.

Suryakumar Yadav says I would have thrown the ball towards Rohit Sharma over T20 World Cup final catch

దిలీప్ సర్ సూచనలతో..
తాజాగా తన స్టన్నింగ్ క్యాచ్‌పై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను క్యాచ్‌లు వచ్చే హాట్‌స్పాట్ ఏరియాల్లో ఫీల్డింగ్ చేయాలని తమ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సూచించాడని సూర్య వెల్లడించాడు.

తన స్టన్నింగ్ క్యాచ్‌పై మాట్లాడుతూ..'నేను పట్టిన ఆ క్యాచ్ వెనుక ఎంతో ప్రాక్టీస్ ఉంది. వివిధ మైదానాల్లో గాలికి తగ్గట్లు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాను. ఫైనల్లో నేను కాస్త దూరంగా నిల్చున్నాను. వైడ్ యార్కర్ వేయాలనే ప్లాన్‌లో భాగంగా రోహిత్ భాయ్, హార్దిక్ నన్ను దూరంగా నిలబెట్టారు. కానీ మిల్లర్ స్ట్రైట్‌గా షాట్ ఆడాడు. ఆ షాట్‌ను చూసిన నేను ఆ బంతి ఎలాగైనా పట్టాలనుకున్నాను.

రోహిత్‌కు విసిరేద్దామనుకున్నా..
సాధారణంగా లాంగాన్‌లో రోహిత్ భాయ్ ఫీల్డింగ్ చేయడు. కానీ ఆ సమయంలో అక్కడే నిల్చున్నాడు. బంతి గాల్లో లేవగానే రోహిత్ శర్మ క్యాచ్ తీసుకుంటారేమోనని అతనివైపు చూశాను. కానీ అతను నా వైపు చూశాడు. వెంటనే నేను పరుగెత్తి బంతిని అందుకున్నాను. రోహిత్ శర్మ నాకు దగ్గరగా ఉంటే అతనికి బంతిని విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేకపోవడంతో నేనే మళ్లీ అందుకున్నా. ఆ 4-5 సెకండ్స్ ఏం జరిగిందో నేను చెప్పలేకపోతున్నా.

కానీ ఈ క్యాచ్ నేపథ్యంలో అభిమానులు విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. అనేక మంది ఫోన్ చేయడంతో పాటు మెసేజ్‌లు చేస్తున్నారు. నా వాట్సాప్‌లో 1000కిపైగా చదవని మెసేజ్‌లు ఉన్నాయి. నేను పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ క్యాచ్‌లో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.'అని సూర్యచెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 3, 2024, 12:43 [IST]
Other articles published on Jul 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+