For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది ఫస్ట్ అవార్డ్.. నేను ఎవ్వరికి ఇవ్వను: సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో ఓ భారత బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Suryakumar Yadav says I don t mind giving this award to the bowler After India s Win Over AFG

అఫ్గాన్‌పై భారత బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారని చెప్పిన సూర్య.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకునేందుకు వారిలో ఒకరు అర్హులని అభిప్రాయపడ్డాడు. అయితే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. ఇది తమ బ్యాటర్లకు దక్కిన తొలి అవార్డ్ అని చెప్పుకొచ్చాడు. సూర్య వ్యాఖ్యలతో అక్కడ నవ్వులు పూసాయి.

'నా ఇన్నింగ్స్ వెనుక ఎంతో కష్టం, నిరంతర సాధన ఉంది. గత కొన్ని రోజులుగా నేను పడ్డ కష్టానికి దక్కని ఫలితం ఈ ఇన్నింగ్స్. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను ఎవరికీ ఇవ్వాలనుకోవడం లేదు. ఈ టోర్నీలో మా బ్యాటర్లు గెలుచుకున్న తొలి అవార్డ్ ఇది. రషీద్ ఖాన్‌ బౌలింగ్ ఆడటం చాలా కష్టం. ప్రపంచంలోనే అతను అత్యుత్తమ స్పిన్నర్. అందుకే అతని బౌలింగ్‌లో నేను క్రమశిక్షణగా బ్యాటింగ్ చేశాను.

ఇక్కడ పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాల్సిన అవసరం ఉంటుంది. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చినప్పుడు ఒకే ఇంటెంట్‌తో బ్యాటింగ్ కొనసాగిద్దామని చెప్పాను. వికెట్ స్లోగా మారవచ్చని, బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని తెలిపాను. ఈ పరిస్థితుల్లో ఒకే ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేయడం శ్రేయస్కారమని సూచించాను.'అని సూర్య చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్‌గా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.

Story first published: Friday, June 21, 2024, 8:16 [IST]
Other articles published on Jun 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+