హార్దిక్ ఆదేశాలతో..
ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ అమెజాన్ ప్రైమ్ హోస్ట్‌తో మాట్లాడిన సూర్య.. ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదేశించాడని, తాను పాటించానని చెప్పుకొచ్చాడు. 'టీ20ల్లో సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ జట్టుకు కావాల్సిన కీలక సమయంలో ఈ సెంచరీ చేయడంతో మరింత సంతోషాన్నిచ్చింది. నేను ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాలని నిర్ణయించుకున్నాను. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా నాతో ఇదే చెప్పాడు. 18, 19వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని, జట్టు స్కోర్ 185 పరుగులు ధాటించాలని చెప్పాడు.
నెట్స్‌లో దంచికొట్టినట్లే..
ఇన్నింగ్స్ 16వ ఓవర్ ముగిసిన వెంటనే చివరి వరకు క్రీజులో ఉండాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. చివరి కొన్ని ఓవర్లను మాకు అనుకూలంగా మలుచుకోవడం చాలా ముఖ్యం. ఓవర్ ఓవర్‌కు పరుగులు రాబట్టం. నెట్స్‌లో దంచికొట్టినట్లే.. ఈ మ్యాచ్‌లో ఆడాను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక సూర్య బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతుండగానే.. రిషభ్ పంత్ అతని వెనుకాల నిల్చోని హత్తుకొని ఇది అసాధారణమైన ఇన్నింగ్స్ అని గట్టిగా అరిచాడు.
కోహ్లీ ఫిదా..
ఇక సూర్య సూపర్ సెంచరీకి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. ట్విటర్ వేదికగా సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. మరోసారి తాను వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అనే విషయాన్ని సూర్య గుర్తు చేశాడని కొనియాడాడు. అయితే సూర్య ఇన్నింగ్స్‌ను లైవ్‌లో చూడలేదని, ఖచ్చితంగా అతను మరో వీడియో గేమ్‌లానే ఆడి ఉంటాడని పేర్కొన్నాడు. కోహ్లీతో పాటు రోహిత్, సచిన్, ఇర్ఫాన్‌లతో పాటు మాజీ క్రికెటర్లు, అభిమానులు సూర్య ఇన్నింగ్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications
