Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డోంట్‌వర్రీ తిరువనంతపురం.. మీవోడు ఆడుతున్నాడు: సూర్యకుమార్ యాదవ్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. విపరీతమైన డ్యూ కండిషన్స్‌లో తమ బౌలింగ్ సత్తాను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తిరువనంతపురం దిగులు చెందాల్సిన అసవరం లేదని, లోకల్ భాయ్ సంజూ శాంసన్‌ తుది జట్టులో ఉన్నాడని చెప్పి నవ్వులు పూయించాడు.

అతని కోసం ఎదురు చూస్తున్నాం..

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గత రాత్రి ఇక్కడ విపరీతమైన డ్యూ కనిపించింది. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకుంటున్నాం. 40 ఓవర్ల పాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతదని గ్రౌండ్స్‌మన్ చెప్పారు. గాయాలతో గత మ్యాచ్‌‌కు దూరమైన అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇచ్చారు. డోంట్‌వర్రీ తిరువనంతపురం సంజూ శాంసన్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు(నవ్వుతూ).

Suryakumar Yadav Says Don t worry Thiruvananthapuram Sanju Samson is playing tonight during IND vs NZ 5th T20I Toss

తిలక్ వర్మ పూర్తిగా కోలుకున్నాడు. అతనికి కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు అవసరం ఉంది. అతను మాకు కీలక ఆటగాడు. అతను జట్టులోకి వస్తే మా టీమ్ మరింత పటిష్టంగా మారుతుంది. అతని కోసం మేం ఎదురుచూస్తున్నాం. మేం అన్ని విభాగాలను పటిష్టపరిచాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలు బాగున్నాయి. ప్రతీ మ్యాచ్‌లో ఏదో ఒకటి చేస్తూ.. కొత్త విషయాన్ని నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు వెళ్లాలి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

నాలుగు మార్పులతో కివీస్..

మరోవైపు న్యూజిలాండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఈ విషయాన్ని మిచెల్ సాంట్నర్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. 'ఈ రాత్రి మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. మేము జట్టులో నాలుగు మార్పులు చేశాం. కాన్వే స్థానంలో ఫిన్ అలెన్, చాప్మన్ స్థానంలో నీషమ్ వచ్చారు. అలాగే జెమీసన్, లాకీ ఫెర్గూసన్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. వారు తిరిగిరావడం సంతోషకరమే. వారి సత్తా చాటేందుకు ఇది ఒక మంచి అవకాశం.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, January 31, 2026, 18:54 [IST]
Other articles published on Jan 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+