సంజనా గణేషన్..
ఆ తరువాత మోడల్, స్పోర్ట్స్ కామెంటేటర్ సంజనా గణేషన్ పేరు వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా సంజనా, బుమ్రా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరి వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజనా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారగా.. గతంలో ఈ బ్యూటీని ఉద్దేశించి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సూర్య ట్వీట్ వైరల్..
బుమ్రా-సంజనా పెళ్లి నేపథ్యంలో సూర్య ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7తో కెరీర్ ఆరంభించారు. ఇంజనీరింగ్ పట్టుభద్రురాలు అయిన ఆమె ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్‌తో సహా పలు క్రీడా ఈవెంట్లకు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం పరిణయానికి దారి తీసిందని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేస్తున్నారు.

కేకేఆర్ హోస్ట్‌గా..
గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అఫిషియల్ హోస్ట్‌గా కూడా చేశారు. అభిమానులు, ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ సందడి సందడి చేశారు. ఈ క్రమంలోనే గతేడాది ట్విటర్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేసిన సంజనా.. ఐపీఎల్ 2020 సీజన్ ఉద్దేశించి ఇక నుంచి నవ్వులేనని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి సూర్య ఈ సారి తమరు ఎవరి తరఫున ఉంటున్నారో? అని ఎంతో చనువున్నట్లుగా కామెంట్ చేశాడు. దానికి సంజనా.. క్రికెట్ తరఫున ఉంటున్నా.. అని బదులిచ్చింది. గతంలో కేకేఆర్‌కు ఆడిన సూర్యకు సంజనాతో మంచి ఫ్రెండ్‌షి ఉంది. ఈ క్రమంలోనే ఆమె ట్వీట్లకు కామెంట్ చేస్తుంటాడు.

నెట్టింట హాట్ టాపిక్..
28 ఏళ్ల సంజనా గణేషన్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. 2014లో వచ్చిన ప్రముఖ డేటింగ్ రియాలిటీ షోలో కూడా సంజన పాల్గొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో షో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకుంటుందనే వార్తలతో సంజన మరింత ఫేమస్ అయ్యారు. అయితే బుమ్రా- సంజనా పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఈ పుకార్లను అటు సంజనా కానీ బుమ్రా కానీ ఖండించలేదు.


Click it and Unblock the Notifications
