Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీ బొమ్మ తిరగబడిందిరా సూరీడు!

హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వెస్టిండీస్ గడ్డపై తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన సూరీడు.. తనకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్‌లోనూ అదే తడబాటుకు గురవుతున్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.

తొలి టీ20లోనూ 92 స్ట్రైక్‌రేట్‌తో 22 పరుగులే చేశాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో వన్డే సిరీస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్న సూర్య.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 78 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. సూర్య వరుస వైఫల్యాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Suryakumar Yadav

ఈ ఏడాది వన్డేల్లో విఫలమైనా.. టీ20ల్లో సూర్య చెలరేగాడు. తనకే సాధ్యమైన ఆటతో టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి సూర్య ఒక్కసారిగా పేలవ ప్రదర్శన కనబర్చడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ ముంబై బ్యాటర్ 16 మ్యాచ్‌ల్లో 181 స్ట్రైక్‌రేట్‌తో 605 పరుగులు చేశాడు.

ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ టాప్ బ్యాటర్లలో సూర్య ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 289 పరుగులు చేశాడు. యావరేజ్ 48 కాగా.. స్ట్రైక్‌రేట్ 145. గత 12 సీజన్లలో ఓవరాల్‌గా 139 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సూర్య 3249 పరుగులు చేశాడు.

2021లో అరంగేట్రం చేసిన సూర్య.. 50 అంతర్జాతీయ టీ20ల్లో 173.69 స్ట్రైక్‌రేట్, 44.65 యావరేజ్‌తో 1697 రన్స్ కొట్టాడు. ముఖ్యంగా గత మూడేళ్లుగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఎలాంటి బౌలర్‌నైనా తన ఇన్నోవేటివ్ షాట్‌తో చితకబాదే సూర్య.. విండీస్ పర్యటనలో మాత్రం తడబడుతున్నాడు.

పరుగులు చేసేందుకే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ రికార్డులను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ అతనికి వార్నింగ్ ఇస్తున్నారు. 'నీ బొమ్మ తిరగబడిందా సూరీడు'అని కామెంట్ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో చివరి మూడు టీ20ల్లోనైనా సూర్య రాణించాలని, లేకుంటే జట్టులో చోటు కోల్పోతాడని అభిప్రాయపడుతున్నారు.

ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కాలంటే సూర్య మునపటి ఫామ్ కనబర్చాలని సూచిస్తున్నారు.

Story first published: Monday, August 7, 2023, 21:06 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+