Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఆ ఇద్దరికీ అవకాశం ఇవ్వలేదు: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణంలోని మార్పుల నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ కాస్త మందకొడిగా కనిపిస్తోంది. అంతేకాకుండా వాతావరణంలో కూడా మార్పులు ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఛేజింగ్‌కు మొగ్గు చూపాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. క్రిస్ గ్రీన్ స్థానంలో నాథన్ ఎల్లిస్‌ను తీసుకున్నాం. ప్రపంచకప్ ఆటగాళ్లంతా స్వదేశం వెళ్లిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు దక్కిన సువర్ణవకాశం ఇది.'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన సూర్య.. దీపక్ చాహర్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీపక్ చాహర్.. ఇంటికి వెళ్లిపోయాడని, దాంతోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. టీమ్‌కాంబినేషన్‌లో భాగంగానే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించలేకపోయామని చెప్పాడు.

Suryakumar Yadav reveals the reason why Washington and Shivam Dube are sitting out in 2nd T20 vs AUS

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ఆటగాళ్లకు నేను ఒక్కటే చెప్పాను. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రేక్షకులతో కిక్కిరిసే మైదానంలో ఆడేందుకు మీకు మరో అవకాశం ఇస్తున్నా. నిర్భయంగా ఆటను ఆస్వాదించండని చెప్పాను. ఇప్పటి వరకు బ్యాటింగ్ యూనిట్ ఎలా రాణించిందో అదే కొనసాగించాలని చెప్పాను. దీపక్ చాహర్ ఇంటికి వెళ్లడంతో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ సిరీస్‌కు 17 మంది సభ్యులను ఎంపిక చేయగా.. 15 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. కానీ వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే‌లకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వారికి అవకాశం ఇస్తారని అభిమానులు భావించారు. కానీ మరోసారి వారిని బెంచ్‌కే పరిమితం చేశారు.

తుది జట్లు:

భారత్: యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ(కీపర్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మొక్‌డెర్మోట్, ఆరోన్ హార్డీ, టీమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(కీపర్), బెన్ ద్వార్షూయిస్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాండార్ఫ్, తన్వీర్ సంఘా

భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, December 3, 2023, 19:00 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+