Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఆ నలుగుర్ని పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav, IND vs AUS 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు.

'గత మ్యాచ్ మాదిరి మళ్లీ మేం బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. డ్యూ ప్రభావం చూపనుంది. మా జట్టులో ఐదు మార్పులు చేశాం. మార్కస్ స్టోయినీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, రిచర్డ్‌సన్, నాథన్ ఎల్లిస్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లను స్వదేశం పంపించడంతో తుది జట్టును మార్చాల్సింది. సీనియర్ ఆటగాళ్ల స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ మా సెలెక్టర్లదే.'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.

Suryakumar Yadav Reveals The Reason Why Tilak Varma and Ishan Kishan are sitting out in 4th T20 vs AUS

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి రావడంతో నాలుగు మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. 'మేం కూడా ఛేజింగ్ చేయాలనుకున్నాం. కానీ మా బ్యాటింగ్ బలంగా ఉంది. ధాటిగా ఆడగలిగే సత్తా ఉంది. ఇక్కడ ఇదే తొలి టీ20. ఎలా ఉంటుందో చూడాలి.

ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. జట్టులో నాలుగు మార్పులు చేశాం. ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో పాటు బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ స్థానాల్లో జితేశ్ శర్మ, దీపక్ చాహర్, ముఖేశ్ కుమార్, శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చారు. 'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను గెలిచి చివరి టీ20 మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి చివరి టీ20ని డిసైడర్‌గా మార్చాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది.

తుది జట్లు:

భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా: జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టీమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(కీపర్), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీ సంఘా

Story first published: Friday, December 1, 2023, 19:17 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+