SA vs IND: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. అంతేకాకుండా వర్షం వచ్చే అవకాశం కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నా. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్‌కాంబినేషన్‌ను సెట్ చేసుకునేందుకు మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ఈ రోజు మేం మంచి ఆరంభాన్ని అందుకుంటామని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్‌లో మా తరఫున ఎలాంటి అరంగేట్రాలు లేవు.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే ముందుగా ఏం ఎంచుకోవాలనేదానిపై క్లారిటీ లేదని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. టాస్ గెలిస్తే ఏం చేయాలనేదానిపై మాకు కాస్త అయోమయం నెలకొంది. కానీ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా.
ఈ మ్యాచ్ జట్టులోని ప్రతీ ఒక్కరికి సువర్ణవకాశం. మరో 5-6 నెలల్లోనే ప్రపంచకప్ జరగనుంది. ఎవరి ఆటను వారు ఆస్వాదిస్తూ చెలరేగాలని ఇప్పటికే చెప్పాను.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో పెద్దగా మార్పులు చేయలేదని చెప్పిన సూర్య.. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుండటంతో తిలక్ వర్మకు అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఇషాన్ కిషన్‌కు బదులు జితేశ్ శర్మను తీసుకున్నామని తెలిపాడు.
ఇరు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బోణీ కొట్టేందుకు ఇరు జట్లు ఆతృతతో ఉన్నాయి.
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్
సౌతాఫ్రికా: రీజా హెండ్రీక్స్, మాథ్యూ బ్రీట్జ్కీ, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, ఆండిలే పెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయిట్జీ, లిజాడ్ విలియమ్స్, టబ్రైజ్ షంసీ.