మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక సారథి చరిత్ అసలంక అన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవాలనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు.
తమ జట్టు ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందని తెలిపాడు. 'జట్టులోని ప్రతీ ఆటగాడికి ఓ బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం. మా నుంచి మరిన్ని విజయాలు, నిలకడైన ప్రదర్శనను మీరు అంచనా వేయవచ్చు'అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.

మరోవైపు పిచ్ చూడటానికి బాగుందని, ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదేనని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. తమ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తామని చెప్పాడు. గౌతమ్ గంభీర్‌తో తనది సుదీర్ఘ కాల బంధమని తెలిపాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా శివమ్ దూబే, సంజూ శాంసన్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ విజయమనేది చరిత్రని, తాము కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పాడు.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్(కీపర్), కుశాల్ పెరీరా, కామిందు మెండీస్, చరిత్ అసలంక(కెప్టెన్), డసన్ షనక, వానిందు హసరంగ, మహీష్ తీక్షణ, మతీష పతీరణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషంక
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్