ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లూజ్ మోషన్స్‌తో బాధపడుతున్నాడని ఆ జట్టు తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దాంతో తాత్కలిక సారథిగా సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
పిచ్ చాలా డ్రైగా ఉందని, మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం అవుతుందని తెలిపాడు. రోహిత్ శర్మకు ఫుడ్ పాయిజన్ అయిందని, వాంతులు విరేచనాలతో బాధపడుతున్నాడని తెలిపాడు. సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని చెప్పిన సూర్య.. జట్టులోకి డాన్ జాన్సెస్ వచ్చాడని చెప్పాడు.

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే ముంబై ఇండియన్స్ సబ్‌స్టిట్యూట్స్ జాబితాలో రోహిత్ శర్మ పేరు ఉండటంతో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్.. బాలికలకు అంకితం చేసింది. స్పోర్ట్స్‌లో బాలికలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఎవరికీ అమ్మలేదు. మొత్తం 19 వేల సీట్లను ఉచితంగా అమ్మాయిలకు కేటాయించారు. అలాగే డబ్ల్యూపీఎల్ నెగ్గిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా టాస్ సమయంలో మైదానంలో మెరిసింది. నారీ శక్తి గొప్పదని, బాలికలకు అవకాశాలు కల్పించాలనే క్యాంపైన్‌లో భాగంగా ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.