నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత వారం రోజులుగా వర్షం పడిందని, మాయిశ్చర్ ఉండే అవకాశం ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. గత వారం రోజులుగా ఇక్కడ వర్షం పడుతోంది. వికెట్‌పై ఏమైనా మాయిశ్చర్ ఉంటే దాన్ని అడ్వాంటేజ్‌గా వాడుకోవాలనుకుంటున్నాం. అరంగేట్రం చేస్తున్న కుర్రాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం. సొంతగడ్డపై ఆటను ఆస్వాదించేందుకు గొప్ప సమయం. మాది గట్టి పోటీనిచ్చే జట్టు. సానుకూల ఫలితాలను సాధించేందుకు కావాల్సిన చర్చలు జరిపాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ బాగుంది. ప్రాక్టీస్ వికెట్ కంటే మెరుగ్గా ఉంది. మేం భారీ లక్ష్యం నమోదు చేయడానికి ప్రయత్నిస్తాం.
జట్టులోని కుర్రాళ్లు నా పనిని మరింత సులభతరం చేశారు. తమ ఫ్రాంచైజీల తరఫున ఆడిన ఫియర్ లెస్ గేమ్‌ను టీమిండియా తరఫున కూడా కొనసాగిస్తున్నారు.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు అవకాశం దక్కలేదు. రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాల్‌లకు తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశం కల్పిస్తామని సూర్య స్పష్టం చేశాడు.
తుది జట్లు:
సౌతాఫ్రికా: రియాన్ రికెల్టన్(కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, అండిలే సిమెలేన్, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.