Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Suryakumar Yadav: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం!

గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర సెంచరీతో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

గ్లేన్ మ్యాక్స్‌వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 నాటౌట్) విధ్వంసకర శతకంతో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేసుంటే విజయం సాధించేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.

 Suryakumar Yadav Reveals The Reason Why India Loss In 3rd T20I vs Australia

'గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయడమే మా బౌలింగ్ ప్రణాళిక. 220 పరుగుల లక్ష్యాన్ని విపరీతమైన డ్యూ ఉన్న పరిస్థితుల్లో కాపాడుకోవాలంటే బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయాలి. కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆరంభం నుంచి మా బౌలర్లపై ఒత్తిడిని పెంచారు. వీలైనంత త్వరగా మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయాలని, ఆఖరి వరకు పోరాడుదామని మా ఆటగాళ్లకు చెప్పాను. కానీ మ్యాక్సీని మేం ఔట్ చేయలేకపోయాం.

దాంతో విజయాన్ని కూడా చేజార్చుకున్నాం. అనుభవం కలిగిన బౌలర్ అనే స్పిన్నర్ అయినా.. విపరీతమైన డ్యూ ఉన్నా.. అక్షర్ పటేల్‌తో 19వ ఓవర్ బౌలింగ్ చేయించాను. గతంలో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అనుభవం ఉండటంతోనే ఈ రిస్క్ తీసుకున్నాను. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు కనబర్చిన పోరాటపటిమ పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), తిలక్ వర్మ(24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 నాటౌట్) శతకం నమోదు చేయగా.. మాథ్యూ వేడ్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రవి బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, November 29, 2023, 8:33 [IST]
Other articles published on Nov 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+