
చెన్నై: లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌లో భాగంగానే ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడని ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను కాదని వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపిస్తూ ముంబై ఇండియన్స్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 17 బంతులాడిన ఇషాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడంతో ముంబై పవర్ ప్లేలో 21 పరుగులు మాత్రమే చేసింది. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడంతో ఈ ప్రయోగంపై సర్వత్రా మిర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ వ్యూహం వెనుక ఉన్న కారణాన్ని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టులోని తన రోల్‌పై క్లారిటీ ఇచ్చాడు. 'ఇషాన్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపించడం లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌లో భాగంగా టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం. లెఫ్టాండర్ ఔటైతే మరో లెఫ్టాండర్ బరిలోకి దిగాలని మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా ఇషాన్, నేను టీమ్‌లో ఒకే తరహా పాత్రను పోషిస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయానికి నేను పూర్తి అంగీకారం తెలిపాను. మా ప్రణాళికల పట్ల మేం చాలా క్లారిటీతోఉన్నాం'అని సూర్య చెప్పుకొచ్చాడు.

టీమ్ పెర్ఫామెన్స్‌పై స్పందిస్తూ... 'ఇదంతా ఆటగాళ్లు వారి ఉత్సాహాన్ని కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుందనేది నా అభిప్రాయం. నెట్స్‌లో ప్రతీ ఒక్కరు బంతిని బలంగా బాదుతున్నారు. అందరూసానుకూల దృక్పథంతోనే ఉన్నారు. కానీ వారిని వారు ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధానంపైనే వారి పెర్ఫామెన్స్ ఆధారాపడి ఉంది. చెన్నైలో ఏం జరిగిందనేదాన్ని మేం ఎక్కువగా ఆలోచించం. ఇప్పుడు ముంబై ఢిల్లీకి వెళ్తుంది. అక్కడ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. టీమ్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది'అని సూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక సూర్య లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అంటే.. కెప్టెన్ రోహిత్ మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించేందుకే బ్యాటింగ్ ఆర్డర్ మార్చామని తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్‌లో వచ్చాడు. ఈ నిర్ణయం ఏ ఒక్కరో తీసుకున్నది కాదు. మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించేందుకు సమాలోచనలు చేస్తుండగా ఈ ఐడియా వచ్చింది. మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆటగాడు ఎవరా? అని చూస్తే మాకు సూర్య కనిపించాడు . దాంతో ఈ మార్పు చేశాం. 'అని రోహిత్ స్పష్టం చేశాడు.