Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఆ ముగ్గుర్ని పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav, IND vs AUS 1st T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం చూపే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్‌లోనే భాగంగానే వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, ఆవేశ్ ఖాన్‌లను తుది జట్టులోకి తీసుకోలేదని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ చూడటానికి చాలా బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉండనుంది.

Suryakumar Yadav Reveals The Reasom Why Washington, Shivam and Avesh are sitting out in 1st T20 vs AUS

ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఈ సిరీస్‌లో అనేక సానుకూలంశాలను ఆశిస్తున్నాం. జట్టులోని కుర్రళ్లంతా ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడారు. వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటను ఆస్వాదించాలని మాత్రమే చెప్పాను. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, ఆవేశ్ ఖాన్‌లను తుది జట్టులోకి తీసుకోలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని ఆస్ట్రేలియా తాత్కలిక సారథి మాథ్యూ వేడ్ తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ కొంచెం నెమ్మదిగా కనిపిస్తోంది. డ్యూ కూడా రానుంది. భారత్‌లో సత్తా చాటేందుకు మా కుర్రాళ్లకు ఇది సువర్ణవకాశం. తదుపరి ప్రపంచకప్‌కు 10-12 మ్యాచ్‌లే ఆడాల్సి ఉండటంతో.. ఈ సిరీస్ నుంచే మా ప్రిపరేషన్‌ను మొదలు పెడుతున్నాం.

ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, జంపా, ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. వారికి విశ్రాంతి ఇచ్చాం.'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా

భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ

Story first published: Thursday, November 23, 2023, 19:01 [IST]
Other articles published on Nov 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+