Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బుమ్రా, దూబేను తప్పించాం: సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ మ్యాచ్‌లో గెలిచినా మేం ఫైనల్‌కు అర్హత సాధించలేమని తెలుసు. అయినా ఈ మ్యాచ్‌ మాకు కీలకమైనదే. ఇది మంచి పిచ్. భారత్‌ను 170-175 పరుగులకే కట్టడి చేయాలనుకుంటున్నాం. భారత ఓపెనర్లు అద్భుతంగా ఆడుతున్నారు. మా జట్టు ఒక మార్పు చేశాం. చమికా స్థానంలో లియానాగే వచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగే చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ఇప్పటివరకు ఆడినట్లుగానే మా జోరు కొనసాగించాలి. వాస్తవానికి మేం ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. ఇక్కడి వాతావరణం బాగుంది. ఇదొక మంచి మ్యాచ్. ఈ గేమ్ కోసం ఎదురు చూశాం. క్యాచ్‌లు వదిలేయడం ఆటలో భాగం. మా జట్టు రెండు మార్పులు చేశాం. బుమ్రా, శివమ్ దూబే స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులోకి వచ్చారు. ఫైనల్ ముంగిట దూబే, బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Suryakumar Yadav Reveals Reason for Bumrah and Dube s Absence in IND vs SL Super 4 Match

టీమిండియాకు ఇది నామమాత్రపు మ్యాచ్. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో మూడోసారి తలపడనుంది. మరోవైపు శ్రీలంక విజయంతో ఈ టోర్నీని ముగించాలని భావిస్తోంది. ఫైనల్ ముంగిట ఈ మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో సూర్యసేన ఉంది.

భారత్:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక:

పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దసున్ శనక, వానిందు హసరంగా, దుష్మంత చమీరా, మహీశ్ తీక్షణ, నువాన్ తుషార

Story first published: Friday, September 26, 2025, 19:50 [IST]
Other articles published on Sep 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+