Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్ కోసం దోస్తాన్ తగ్గించా.. లేట్ నైట్ పార్టీలు మానేసా: సూరీడు

ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు.. ఆ మహిళ కట్టుకున్న ఇల్లాలే అయితే ఆ విజయంలో ఆమెకూ సగభాగం ఉంటుంది. అందుకే తన గెలుపులో తన భార్య దేవిషా శెట్టి పాత్ర కీలకమంటున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. దోస్తాన్ తగ్గించడంతో పాటు లేట్ నైట్ పార్టీలు, వీకెండ్ ట్రిప్స్ పూర్తిగా మానేయడంతోనే క్రికెటర్‌గా సక్సెస్ అయ్యానని చెప్పాడు. తన సతీమణి దేవిషా శెట్టి రాకతోనే ఇది సాధ్యమైందని, ఆమె గైడెన్సీతోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నానని తెలిపాడు.

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతని సతీమణి గీతా బస్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'హూస్ ది బాస్?'అనే యూట్యూబ్ చాట్ షోకు సతీమణి దేవిషాతో కలిసి హాజరైన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దేవిషాతో తన లవ్ స్టోరీతో పాటు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని గుర్తు చేసుకున్నాడు.

Suryakumar Yadav Reveals Career-Defining Mindset Change Reduced Friend Circle Cut Late-Night Outings

మేడమ్ ఎంట్రీతో..

'2016లో నేను చాలా సంతృప్తిగా ఉండేవాడిని. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాడిని. ఆటను ఆస్వాదించేవాడిని. కానీ తర్వాత ఆటలో మరోస్థాయి ఉందనే విషయం నెమ్మదిగా అర్థమైంది. ఆ సమయంలో నేను నిలకడగా పరుగులు చేసాను. అయినా సమస్య ఎక్కడుందో అర్థం కాలేదు. నా వయసు గల ఆటగాళ్లు అప్పటికే టీమిండియాకు ఆడారు. ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు మేడమ్ ( దేవిషా శెట్టి) నా జీవితంలోకి వచ్చింది.

నా సతీమణి సూచనలతో దోస్తాన్ తగ్గించాను. లేట్ నైట్ పార్టీలు.. వీకెండ్ ట్రిప్స్ మానేసాను. క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్స్‌పై ఫోకస్ పెట్టాం.నేను కొంత క్రమశిక్షణను అలవర్చుకున్నాను. దాంతో ఐపీఎల్ 2018 సీజన్ నాకు బాగా సాగింది. ఆ తర్వాత 2019లో మరింత మెరుగ్గా రాణించాను. 2020 అయితే మంచికి మరింత మంచిదని చెప్పవచ్చు. నా సతీమణితో కలిసి 2018లో కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాను. అక్కడి నుంచి నా గ్రాఫ్ పెరిగింది. అయినా నాకు టీమిండియా తలుపు తెరుచుకోలేదు. మేం ఇద్దరం కలిసి ఆ డోర్‌ను బద్దలు కొట్టాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ప్రోత్సాహం లేదని గమనించాను..

దేవిషా శెట్టి మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్‌కు చిన్నపాటి ప్రోత్సాహం లేదనిపించిందని, ఆ పాత్రను తాను పోషించానని చెప్పింది. స్నేహితులు, పార్టీలు కెరీర్‌కు అడ్డు కాకూడదని అర్థమయ్యేలా వివరించానని పేర్కొంది. 'మేం పెళ్లి చేసుకున్నప్పుడు జీవితంలో సక్సెస్ కావాలనే అదనపు ప్రేరణ ఉండేది. అయితే అది ఉండాల్సినంత లేదనే విషయం నాకు అర్థమైంది. సూర్యకు చిన్నపాటి ప్రోత్సాహం ఎవరూ ఇవ్వడం లేదని నేను గమనించాను. స్నేహితులు, పార్టీలు గొప్పవే కానీ కెరీర్‌కు అడ్డు కాకూడదని అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఏడాది పట్టింది. ఒక దశ తర్వాత అతను సక్సెస్ సాధించాడు. క్రికెట్ పరంగా అతను సాధించిన సక్సెస్ అతనిదే. అందులో నా పాత్ర ఏం లేదు. కానీ మానసికంగా అతనికి అండగా నిలిచి కొంచెం ప్రోత్సహించాను.'అని దేవిషా తెలిపింది.

Story first published: Sunday, July 13, 2025, 20:29 [IST]
Other articles published on Jul 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+