Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీతో మ్యాచ్‌.. సూర్యకుమార్ యాదవ్ దూరం?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు రాయ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత గురువారం(మే 7) తన సతీమణి దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రసవ సమయంలో తన సతీమణి పక్కన ఉండేందుకు సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్‌ను వదిలి వెళ్లాడు.

ఆర్‌సీబీతో మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు రాయ్‌పూర్ వెళ్లగా.. సూర్యమాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. దాంతో ఆర్‌సీబీతో మ్యాచ్ నుంచి సూర్య దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్‌లకు సూర్య అందుబాటులో ఉంటాడని క్రిక్‌బజ్ పేర్కొంది. మ్యాచ్ రోజే జట్టుతో చేరుతాడని తెలిపింది.

హార్దిక్ పాండ్యా డౌట్..

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో దూరం కాగా.. సూర్య జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడే విషయంపై క్లారిటీ లేదు. శుక్రవారం హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ పరీక్ష‌లు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌లో నెగ్గితే.. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా ఆడకపోతే మళ్లీ సూర్యనే జట్టును నడిపించనున్నాడు.

ఒకవేళ సూర్య కూడా దూరమైతే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ను నడిపించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 19.50 సగటుతో 195 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీతో పాటు ఐదు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. వరుసగా సూర్య విఫలమవుతున్నా.. తనదైన రోజున మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాడని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తోంది.

ముంబై చెత్త ప్రదర్శన..

మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తోంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. మిగిలిన 4 మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించలేకపోతుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై.. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్‌లో ఓడి నిష్క్రమించింది. తాజా సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాట పట్టేందుకు రెడీ అయ్యింది.

Story first published: Saturday, May 9, 2026, 18:58 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+