
అభిమానులు వెంటపడటం..
ఆటగాడిగా మారాక తన జీవితంలో వచ్చిన మార్పులను సూర్యకుమార్ పంచుకొన్నాడు. పేరు, ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తానేమీ మారలేదని తెలిపాడు. అయితే కుటుంబంతో కలిసి కొన్ని పనులు చేయలేని పరిస్థితి వచ్చిందన్నాడు.'నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను అనుసరిస్తున్నారు. ఇది నాకు కొత్తగా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో భారతీయ అభిమానులను కలిశా. సింగపూర్‌లో ఓ జంట నన్ను చూసి 'సూర్యకుమార్.. ఎలా ఉన్నారు' అని అరిచింది. నేను షాక్ అయ్యాను. నేనేం చేశాను? వారిలా ఎందుకు చేస్తున్నారని ఆశ్చర్యపోయాను.

కుటుంబంతో కలిసి..
నేను ఇక నా ఫ్లైట్‌ని అందుకోవడానికి పరిగెత్తాను. నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కానీ నా టైం మారింది. నాతో ప్రయాణం చేయడం అంత సులభం కాదని నా కుటుంబానికి అర్థమైంది. ఇది వరకు కుటుంబమంతా కలిసి సినిమాలకు, విందులకు వెళ్లే వాళ్లం. కుటుంబంతో వెళ్లడం నాకు చాలా నచ్చేది. కానీ ఇప్పుడు వాటికి పరిమితులున్నాయి'అని చెప్పుకొచ్చాడు.

వీడియో గేమ్ ఆడుతున్నావా?
'నేను విరాట్ భాయ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ నా దగ్గరికి వచ్చి 'నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావా.. వేరే లెవల్‌లో బ్యాటింగ్ చేస్తున్నావ్'అని అన్నాడు. కోహ్లీ నోట అలాంటి మాటలు వినడం చాలా సంతోషాన్నిచ్చింది.'అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్ సందర్భంగా సూర్య బ్యాటింగ్‌కు ఫిదా అయిన కోహ్లీ.. అతనికి టేకే బౌ ఇచ్చిన విషయం తెలిసిందే.

2022 టాపర్..
ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన సూర్య.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్‌తో 1408 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
